Share News

26న తిరుమలకు సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Nov 24 , 2026 | 03:39 AM

వేంకటేశ్వరస్వామికి 121 కేజీల భారీ స్వర్ణాభరణాల సెట్‌ను సమర్పించే కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల 26వ తేదీన తిరుమల రానున్నారు. చెన్నైకి చెందిన ఓ ఎన్‌ఆర్‌ఐ శ్రీవారి కోసం ఈ ఆభరణాలను సిద్ధం చేయించారు.

26న తిరుమలకు సీఎం చంద్రబాబు

46 రకాల ఆభరణాలను సిద్ధం చేసిన దాత

టీటీడీ చరిత్రలోనే అతి భారీ కానుకలు

తిరుమల, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): వేంకటేశ్వరస్వామికి 121 కేజీల భారీ స్వర్ణాభరణాల సెట్‌ను సమర్పించే కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల 26వ తేదీన తిరుమల రానున్నారు. చెన్నైకి చెందిన ఓ ఎన్‌ఆర్‌ఐ శ్రీవారి కోసం ఈ ఆభరణాలను సిద్ధం చేయించారు. తిరుమల ఆలయ చరిత్రలోనే ఇంత భారీ కానుకను ఓ భక్తుడు విరాళంగా అందజేయనుండటం ఇదే మొదటిసారి. నిజానికి, ఈ విషయం ఏడాది క్రితమే సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ క్రమంలో శ్రీవారి అలంకరణకు ఉపయోగకరంగా ఉండేలా టీటీడీతో సదరు దాత సంప్రదింపులు జరిపారు. ఓ జ్యువెలరీ సంస్థ ద్వారా 46 రకాల బంగారు ఆభరణాల సెట్‌ను తయారు చేయించారు. ఇందులో కిరీటం, భుజకీర్తులు, శంఖుచక్రాలు, వడ్డాణం, హస్తాలు, మెడ ఆభరణాలు ఉన్నాయి. వీటిని శ్రీవారికి సమర్పించే కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు.

ఈ వార్తలనూ చదవండి:

చేతులెలా వచ్చాయ్‌!

నామినీ ఉంటేనే బీమా


ఒకే దాత నుంచి రావడం ఇదే తొలిసారి

శ్రీవేంకటేశ్వరస్వామి రిచ్‌ గాడ్‌. గతేడాది లెక్కల ప్రకారం బ్యాంకుల్లోని బంగారు నిల్వల విలువే లక్షన్నర కోట్లు. ఇక, 20 వేల కోట్ల డిపాజిట్లతో పాటు 10 వేల కోట్ల విలువైన ఆభరణాలు ఉన్నాయి. వీటిలో ఆరు వేల కోట్ల విలువైన ఆభరణాలు మాత్రమే స్వామి అలంకరణకు వినియోగిస్తారు. మరోవైపు శ్రీవారికి దేశవ్యాప్తంగా ఉన్న భూములు, భవనాల ఆస్తుల విలువ దాదాపు రూ.రెండు లక్షల కోట్లకుపైమాటే. ఇలా మొత్తం లెక్క కడితే దాదాపు స్వామి సంపద నాలుగు నుంచి ఐదు లక్షల కోట్లు దాటుతుందని అంచనా. వందల ఏళ్లుగా ఎందరో రాజులు, నవాబుల నుంచి సామాన్య భక్తుల వరకు అందించిన కానుకలతో సంపన్నుడిగా శ్రీవారు నిలిచారు. అయితే వీటన్నింటిలో ప్రత్యేకంగా నిలిచేలా, ఒకే భక్తుడు 121 కేజీల బంగారు ఆభరణాలను ఇవ్వడం టీటీడీ చరిత్రలో మిగిలిపోనుంది. స్వామి వారికి అలంకరించే దాదాపు 650 కిలోల బరువు కలిగిన ఆభరణాల్లో ఈ నూతన కానుకలు జత కానున్నాయి.

ఈ వార్తలనూ చదవండి:

చేతులెలా వచ్చాయ్‌!

నామినీ ఉంటేనే బీమా

Updated Date - Nov 24 , 2026 | 03:44 AM