తీవ్రంగా నష్టపోయాం!
ABN , Publish Date - Oct 29 , 2026 | 03:41 AM
రాష్ట్రంపై ఆర్నబ్ తుఫాన్ తీవ్ర ప్రభావం చూపిందని, నష్టం తీవ్రత ఎక్కువగా ఉందని సీఎం చంద్రబాబు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లారు. తుఫాన్ ప్రభావం, నష్ట తీవ్రతపై బుధవారం ఆయనకు లేఖ రాశారు. స్వయంగా ఫోన్ చేసి కూడా మాట్లాడారు.
తుఫాన్ ప్రాంతాలకు త్వరగా కేంద్ర బృందాన్ని పంపండి
కేంద్ర సంస్థల సహకారాన్ని కొనసాగించండి
అమిత్‌షాకు ముఖ్యమంత్రి లేఖ
70,900 హెక్టార్లలో నీటమునిగిన వరి
అమరావతి, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంపై ఆర్నబ్ తుఫాన్ తీవ్ర ప్రభావం చూపిందని, నష్టం తీవ్రత ఎక్కువగా ఉందని సీఎం చంద్రబాబు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లారు. తుఫాన్ ప్రభావం, నష్ట తీవ్రతపై బుధవారం ఆయనకు లేఖ రాశారు. స్వయంగా ఫోన్ చేసి కూడా మాట్లాడారు. నష్టంపై సమగ్ర అంచనా అనంతరం కేంద్రానికి నివేదిక సమర్పిస్తామని, నష్టాన్ని అంచనా వేసేందుకు వీలైనంత త్వరగా కేంద్ర బృందాన్ని పంపించాలని కోరారు. సహాయ చర్యలకు ఎన్డీఆర్‌ఎఫ్, ఇతర కేంద్ర సంస్థల సహకారం కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ‘తుఫాన్ తీవ్రత కారణంగా రాష్ట్రంలో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి.
సహాయ చర్యల కోసం 14 జిల్లాల్లో 16 ఎన్డీఆర్‌ఎఫ్ 11 ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలను నియమించాం. ప్రభావిత ప్రాంతాల్లో 28 వేల మందికి పైగా ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాం. ప్రాథమిక అంచనా ప్రకారం.. 180 ఇళ్లు దెబ్బతిన్నాయి. రహదారులపై 220కి పైగా చెట్లు కూలిపోయాయి. తీర ప్రాంతాల్లో చాలా చోట్ల రహదారులు ధ్వంసమయ్యాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. విద్యుత్ పునరుద్ధరణ ప్రాథమిక అంచనా ప్రకారం సుమారు 70,900 హెక్టార్లలో వరి పంట నీట మునిగింది. ఇప్పటి వరకూ 10,450 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. కోనసీమ, కాకినాడ, తూర్పు, పశ్చిమ గోదావరి, అనకాపల్లి, కృష్ణా జిల్లాల్లో తుఫాను ప్రభావం అధికంగా ఉంది.’ అని లేఖలో పేర్కొన్నారు.
ప్రాథమికనష్టం అంచనాలు పంపుతున్నాం..
అమిత్ షాకు ఫోన్ చేసిన సీఎం..
తుఫాన్ నష్టాన్ని వివరించారు. నష్టం తాలూకు ప్రాథమిక అంచనాలను పంపుతున్నామని, కేంద్ర బృందాన్ని త్వరగా పంపి, కేంద్రం సాయాన్ని కూడా త్వరగా అందేలా చూడాలన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఆర్నబ్ తుఫాన్ బాధితులకు సీఎం చంద్రబాబు భారీ ఊరట