చర్చి స్లాబు కూలి ముగ్గురు మృతి
ABN , Publish Date - Sep 11 , 2026 | 06:24 AM
కొత్తగా నిర్మిస్తున్న చర్చిలో స్లాబు కూలిపోయి ముగ్గురు కూలీలు మరణించారు. మరో ఏడుగురు కూలీలు గాయాలపాలయ్యారు.
తమిళనాడు-చిత్తూరు సరిహద్దులో ఘటన
గుడిపాల(చిత్తూరు జిల్లా), సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): కొత్తగా నిర్మిస్తున్న చర్చిలో స్లాబు కూలిపోయి ముగ్గురు కూలీలు మరణించారు. మరో ఏడుగురు కూలీలు గాయాలపాలయ్యారు. చిత్తూరు జిల్లా గుడిపాల మండలం మండికృష్ణాపురం కాలనీ సమీపంలోని తమిళనాడు రాష్ట్ర సరిహద్దులో గురువారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు కొత్తగా నిర్మిస్తున్న చర్చికి గురువారం స్లాబ్ వేశారు. స్లాబ్‌పైన మేస్త్రీతోపాటు మరికొందరు కూలీలున్నారు. స్లాబ్ వేయడం 90 శాతం పూర్తయింది. సెంట్రింగ్ సరిగా వేయకపోవడంతో స్లాబ్ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో తమిళనాడు రాష్ట్రం కాట్పాడికి చెందిన పది మంది కూలీలు శిథిలాల కింద చిక్కుకుపోయారు. స్థానికుల సమాచారంతో అగ్నిమాపకశాఖ సిబ్బంది, పోలీసులు హుటాహుటిన చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీసీ కెమెరాల నిఘాలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు
ఉమ్మడి కుటుంబాలకు పెద్ద ఇళ్లు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News