Share News

భద్రతా సిబ్బంది వైఫల్యం జరగలేదు: టీటీడీ క్లారిటీ..

ABN , Publish Date - May 03 , 2026 | 06:11 PM

తిరుపతి జిల్లా నాగలాపురం శ్రీ వేద నారాయణస్వామి ఆలయం వద్ద భద్రతా సిబ్బంది వైఫల్యమంటూ వస్తున్న వార్తలపై టీటీడీ స్పందించింది. టీటీడీ భద్రతా సిబ్బంది వైఫల్యం అన్న వార్తలో నిజం లేదని తేల్చి చెప్పింది.

భద్రతా సిబ్బంది వైఫల్యం జరగలేదు: టీటీడీ క్లారిటీ..
Sri Veda Narayanaswamy Temple

తిరుపతి: జిల్లాలోని నాగలాపురం శ్రీ వేద నారాయణస్వామి ఆలయం వద్ద భద్రతా సిబ్బంది వైఫల్యమంటూ వస్తున్న వార్తలపై టీటీడీ స్పందించింది. టీటీడీ భద్రతా సిబ్బంది వైఫల్యం అన్న వార్తలో నిజం లేదని తేల్చి చెప్పింది. సోషల్ మీడియా ప్రచారాన్ని నమ్మొద్దని భక్తులను టీటీడీ అధికారులు కోరారు. నాగలాపురం గ్రామంలోని శ్రీ వేద నారాయణస్వామి ఆలయానికి స్థానిక ఎమ్మెల్యే ఈరోజు (ఆదివారం) ఉదయం వచ్చారని అధికారులు తెలిపారు.


స్వామివారి దర్శనం కోసం ఎమ్మెల్యే, ఆయన సిబ్బంది ఆలయంలోకి ప్రవేశించే సందర్భంగా చిన్నపాటి వాదన జరిగిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఎమ్మెల్యేతో పాటు వచ్చిన గన్‌మెన్ తన తుపాకీ తీసుకుని రావడంతో టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది వారించడం జరిగిందని పేర్కొన్నారు. దీంతో సదరు గన్‌మెన్ దర్శనానికి వెళ్లకుండా ఉండిపోయారని చెప్పారు. అయితే, దర్శనం అనంతరం ఎమ్మెల్యేను బయటకు తీసుకొచ్చేటప్పుడు టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది వారించినా వినకుండా ఆశీర్వాద మండపం వరకు గన్‌మెన్ వెళ్లారని వెల్లడించారు.


అనంతరం ఎమ్మెల్యేతో పాటు గన్‌మెన్ బయటకు వచ్చారని అధికారులు చెప్పారు. టీటీడీ నిబంధనలను సదరు గన్‌మెన్‌కు సవివరంగా తెలియజేసినప్పటికీ.. నిబంధనలను ఉల్లంఘించారని చెప్పుకొచ్చారు. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీస్ యంత్రాంగం దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

వైసీపీని 'గొడ్డలి పార్టీ' అనకుంటే మరేమంటారు?: ఎమ్మెల్యే అహ్మద్

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై ప్రశంసలు కురిపించిన పీవీ సింధు

Updated Date - May 03 , 2026 | 06:48 PM