Share News

తిరుపతిలో దారుణం.. బంగారు నగల కోసం వృద్ధురాలిని

ABN , Publish Date - Mar 02 , 2026 | 04:36 PM

తిరుపతిలో ఓ వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. దుండగులు ఆమె గొంతును నులిమి, ఆ తర్వాత దిండుతో అదిమి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు.

తిరుపతిలో దారుణం.. బంగారు నగల కోసం వృద్ధురాలిని
Tirupati news

తిరుపతి, మార్చి 2: తిరుపతిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బంగారు నగల కోసం వృద్ధురాలిని దుండగులు హత్య చేశారు. వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అరవపల్లె వీధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతురాలు కె.లక్ష్మమ్మగా(67) గుర్తించారు. టీటీడీలో రిటైర్డ్ అయిన ఆమె ఇంట్లో ఒంటరిగా ఉండగా ఈ ఘటన జరిగింది. దుండగులు ఆమె గొంతును నులిమి, ఆ తర్వాత దిండుతో అదిమి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. ఆమె ఒంటిపై ఉన్న 100 గ్రాములకు పైగా బంగారు నగలను కాజేసి పరారయ్యారు.


సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. హత్యకు గల ఆధారాలను క్లూస్ టీంతో కలిసి వెస్ట్ పోలీసులు సేకరించారు. మృతదేహాన్ని రుయా మార్చురీకి తరలించారు. సొంత మనవడే ఈ హత్యకు కారణమైనట్లు ప్రాథమిక విచారణలో పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ హత్యకు సంబంధించి ఇప్పటికే ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


ఇవి కూడా చదవండి...

కొడాలి నానికి ఆ భయం పట్టుకుంది: వెనిగండ్ల రాము

కాకినాడ సీజన్ 5 రెస్టారెంట్‌లో దారుణం..

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 02 , 2026 | 04:37 PM