Share News

తిరుమలలో దివ్వెల మాధురి అత్యుత్సాహం.. భక్తుల ఆగ్రహం

ABN , Publish Date - Mar 05 , 2026 | 09:38 PM

ఇటీవల తిరుమలలో వరుసగా నిబంధనలు ఉల్లంఘించి కొంతమంది సెలబ్రిటీలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. వారిపై ఓ వైపు టీటీడీ మరోవైపు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్యనే యూట్యూబర్ గీతూ రాయల్ ఒక పాటపై డ్యాన్స్ చేసినందుకు టీటీడీ బోర్డు సీరియస్ అయ్యింది. తాజాగా ఇప్పుడు దివ్వెల మాధురి నిబంధనలు ఉల్లంఘించారంటూ విమర్శలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

తిరుమలలో దివ్వెల మాధురి అత్యుత్సాహం.. భక్తుల ఆగ్రహం
Divvela Madhuri Tirumala controversy,

తిరుపతి: ఇటీవల తిరుమలలో వరుసగా నిబంధనలు ఉల్లంఘించి కొంతమంది సెలబ్రిటీలు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ మధ్యనే యూట్యూబర్ గీతూ రాయల్ ఒక పాటపై డ్యాన్స్ చేసినందుకు టీటీడీ బోర్డు సీరియస్ అయ్యింది. తాజాగా ఇప్పుడు దివ్వెల మాధురి టీటీడీ నిబంధనలు మరోసారి ఉల్లంఘించారు. బిగ్ బాస్ ఫేమ్ తనూజ పుట్టస్వామి పుట్టిన రోజు సందర్భంగా, కొండపై దివ్వెల మాధురి కేక్ కట్ చేయడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


దివ్వెల మాధురి తన స్నేహానికి గుర్తుగా బిగ్ బాస్ ఫేమ్ తనూజ పుట్టస్వామికి పుట్టిన రోజు వేడుకలను నిర్వహించింది. శ్రీవారి సన్నిధిలో కేక్‌లపై నిషేధం ఉన్నప్పటికీ తనూజాతో కేక్ కట్ చేయించారు. తాము బస చేసిన గెస్ట్ హౌస్‌లో ఈ వేడుకలు నిర్వహించారు. దీనికి సంబంధించిన ఒక వీడియోను మాధురి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దీంతో ఆమెపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పవిత్ర పుణ్య క్షేత్రంలో పాశ్చాత్య సంస్కృతిని ప్రోత్సహించడం ఏంటంటూ? భక్తులు ప్రశ్నిస్తున్నారు. గతంలో కూడా తిరుమల కొండపై దివ్వెల మాధురి నిబంధనలను ఉల్లంఘించారు. గతంలో టీటీడీ సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చినా.. మళ్లీ అలాంటి పని చేయడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

కాళేశ్వరంపై కమిషన్ ఏర్పాటు వెనుక ఎలాంటి దురుద్దేశం లేదు: ఏజీ

ముగిసిన కడియం విచారణ.. దానం విచారణ వాయిదా

Updated Date - Mar 05 , 2026 | 09:51 PM