TDP: కుప్పంలో టీడీపీ విజయోత్సవం
ABN , Publish Date - Aug 11 , 2026 | 01:06 AM
రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలన విజయాలను స్మరించుకుంటూ కుప్పంలో సోమవారం టీడీపీ ఆఽధ్వర్యంలో సాగిన విజయోత్సవ ర్యాలీ సాగింది.
కుప్పం, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): వీధులవెంట పసుపచ్చటి ప్రవాహం. వేదికపై విజయాల గానం. శ్రేణుల్లో అంతులేని విజయోత్సాహం. రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలన విజయాలను స్మరించుకుంటూ కుప్పంలో సోమవారం టీడీపీ ఆఽధ్వర్యంలో సాగిన విజయోత్సవ ర్యాలీ దృశ్యమిది. కుప్పం చెరువుకట్ట మీదినుంచి పాతపేట, ఎమ్మార్‌రెడ్డి సర్కిల్ మీదుగా ఆర్టీసీ బస్టాండు కూడలి దాకా ర్యాలీ సాగింది. అంబేడ్కర్.. ఎన్టీఆర్ విగ్రహాలకు నివాళులర్పించాక భారీ బహిరంగ సభ ప్రాంగణానికి చేరారు. పార్టీ కార్యకర్తలే కాదు, అన్ని వర్గాలకూ చెందిన సామాన్య జనం పెద్దయెత్తున సభకు హాజరయ్యారు. వైసీపీ ఐదేళ్ల అరాచక పాలనలో వ్యవస్థలన్నీ గాడి తప్పాయని, దాడులు, దౌర్జన్యాలతో ప్రజలు దారుణమైన పరిస్థితులు ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడగానే పరిస్థితులు మారిపోయాయన్నారు. వైసీపీ వారసత్వంగా ఖాళీ ఖజానా అందినా.. చంద్రబాబు సమర్థతతో పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. కూటమి పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండడం భరించలేకపోతున్న జగన్‌రెడ్డి, తన రాక్షస గణాన్ని ఉసిగొల్పి ఆందోళనల పేరుతో అరాచకం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. డీఎస్సీపై సాగుతున్న ఆందోళనలు, దుష్ప్రచారం అటువంటి కుట్రలేనని చెప్పారు. ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో అమలు చేసిన, చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఏకరువు పెట్టారు. అనంతరం వేదికమీద ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు.
ఈకార్యక్రమంలో చిత్తూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు షణ్ముగం, ప్రధాన కార్యదర్శి సునీల్ కుమార్ చౌదరి, ఆర్టీసీ వైస్ చైర్మన్ పీఎస్ మునిరత్నం, ఏపీఐఐసీ డైరెక్టర్ ప్రేమ్ కుమార్, రెస్కో చైర్మన్ వీజీ ప్రతాప్, కడా పీఏసీ సభ్యుడు రాజ్ కుమార్, టీటీడీ బోర్డు సభ్యుడు వైద్యం శాంతారాం, కుప్పం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జి.మునిరాజు, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, కుప్పం మున్సిపల్ టీడీపీ అధ్యక్షుడు కాణిపాకం వెంకటేష్, రూరల్ మండల అధ్యక్షుడు ఎం.రాజగోపాల్, ఏఎంసీ మాజీ చైర్మన్ సత్యేంద్ర శేఖర్, బీజేపీ, జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జులు ఎన్‌ఎ్‌స.తులసీనాథ్, నరే్‌షతోపాటు పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.