Share News

SVMC: ఐఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్స్‌లో ఎస్వీఎంసీకి 69 వ స్థానం

ABN , Publish Date - Aug 11 , 2026 | 12:54 AM

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌ వర్క్‌(ఐఐఆర్‌ఎఫ్‌) ర్యాంకింగ్‌లో తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర మెడికల్‌ కళాశాల 69వ ర్యాంకు సాధించింది.

SVMC: ఐఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్స్‌లో ఎస్వీఎంసీకి 69 వ స్థానం
శ్రీ వెంకటేశ్వర మెడికల్‌ కళాశాల

తిరుపతి సెంట్రల్‌, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): ఇండియన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌ వర్క్‌(ఐఐఆర్‌ఎఫ్‌) ర్యాంకింగ్‌లో తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర మెడికల్‌ కళాశాల 69వ ర్యాంకు సాధించింది.ప్రధానంగా బోధన, పరిశోధన, మౌలిక వసతులే ర్యాంకింగులో కీలకంగా నిలిచాయి. రాష్ట్రంలోని ఆరు ప్రభుత్వ వైద్య కళాశాలలు దేశంలోని టాప్‌ 70లో చోటు దక్కించుకోగా అందులో తిరుపతి ఎస్వీ మెడికల్‌ కళాశాల ఐదో స్థానం సాధించింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రవిప్రభు మాట్లాడుతూ వైద్య విద్యతో పాటు పరిశోధన, ఆధునిక మౌలిక వసతులు, క్లినికల్‌ శిక్షణ, రోగులకు మెరుగైన వైద్య సేవలు మరింత బలోపేతం చేసే దిశగా కృషి చేస్తామని చెప్పారు.

Updated Date - Aug 11 , 2026 | 12:54 AM