Share News

తిరుపతిలో కోర్టు భవన సముదాయానికి భూమి పూజ

ABN , Publish Date - Mar 01 , 2026 | 12:31 PM

తిరుపతిలో కోర్టు భవన సముదాయానికి భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్ సూర్యకాంత్ .. ఏపీలోని విజనరీ ప్రభుత్వం రాబోయే వంద సంవత్సరాలకు అవసరమైన విధంగా కోర్ట్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టడం అభినందనీయమన్నారు.

తిరుపతిలో కోర్టు భవన సముదాయానికి భూమి పూజ
Tirupati Court Complex

తిరుపతి: రూరల్ దామినీడులో 120 కోట్ల రూపాయలతో 14.44 సెంట్ల భూమిపై 16 కోర్టు భవన సముదాయాని భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిరుమల ఆలయానికి సమానమైన ఆలయం మరొకటి లేదని కోట్లాది మంది భక్తులు భావిస్తారు. అలాగే, తిరుపతిలో నిర్మిస్తున్న కోర్ట్ కాంప్లెక్స్ కూడా న్యాయం అందించటంలో మరో ‘ఆలయం’ కావాలన్నారు. ఏపీలోని విజనరీ ప్రభుత్వం రాబోయే వంద సంవత్సరాలకు అవసరమైన విధంగా కోర్ట్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టడం అభినందనీయం అని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ పేర్కొన్నారు.


న్యాయం అందించడంలో టైంలైన్ అవసరమని చెప్పారు. బెంచ్, బార్ వేరు వేరు కాదని, బార్ నుంచి వాదన సరిగ్గా ఉన్నప్పుడే జడ్జిల నుంచి నాణ్యమైన తీర్పులు ఉంటాయని చెప్పారు. నాణ్యమైన తీర్పులు వచ్చినప్పుడు, ప్రజల్లో న్యాయవ్యవస్థపై నమ్మకం పెరుగుతుందని అన్నారు. చెల్లెల్లు, కుమార్తెలైన మహిళా న్యాయవాదులకు మంచి సౌకర్యాలు కోర్ట్ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేయాలని చెప్పారు. మెడికల్ సెంటర్ కూడా కాంప్లెక్స్‌లో ఉండేలా చేయాలన్నారు. అప్పుడే వయసులో పెద్దవారైన వారు కోర్టు కాంప్లెక్స్‌లో ఆరోగ్య సమస్యలు వచ్చినా ప్రాణహాని భయం ఉండదని జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు.


ఈ క్రమంలోనే ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరాజ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ, దేశంలోని చాలా కోర్టుల్లో గతంలోనూ, ఇప్పుడూ న్యాయమూర్తుల ఛాంబర్లు సరిగ్గా ఉండేవి కాదని తెలిపారు. టాయిలెట్లు కూడా లేకపోవడం వల్ల, న్యాయవాదులు మాత్రమే కాదు, క్లైయింట్లు కూడా ఇబ్బందులు పడుతుంటారని పేర్కొన్నారు. గతంలో కాశ్మీర్ వరదల సమయంలో అక్కడి హైకోర్టు భవనం పూర్తిగా మునిగిపోయిన సంగతి గుర్తు చేశారు. న్యాయవ్యవస్థపై ప్రజల్లో నమ్మకం కలిగేలా న్యాయమూర్తులు ఇండ్లలో, టెంట్ల కింద కూడా కోర్టులు నడిపారని చెప్పారు. 2023లో ఆయన తిరుపతికి వచ్చిన తరువాత, అన్ని జిల్లాల్లోని కోర్టుల్లో ఏసీలు ఏర్పాటు చేయించారని తెలిపారు. దీని వల్ల క్లైయింట్లు, న్యాయవాదులు సౌకర్యవంతమైన వాతావరణంలో కోర్ట్ సేవలు పొందుతున్నారని చెప్పారు. తిరుపతిలో కొత్తగా 14 ఎకరాల భూభాగంలో నిర్మిస్తున్న కోర్టు సముదాయం రాబోయే వంద సంవత్సరాల అవసరాలను తీర్చగలిగే విధంగా రూపొందించనున్నారని జస్టిస్ ధీరాజ్ సింగ్ ఠాకూర్ వెల్లడించారు.


ఇవీ చదవండి:

వేట్లపాలెం బాణాసంచా ప్రమాదం.. లొంగిపోయిన ఫైర్‌వర్క్స్ యజమాని

హ్యాపీ బర్త్ డే నితీశ్ జీ.. ప్రజాసేవలో మరింత ముందుకెళ్లాలి: సీఎం చంద్రబాబు

Updated Date - Mar 01 , 2026 | 12:51 PM