Mangoes: సీజన్ చివర్లో మామిడికి రికార్డు ధరలు
ABN , Publish Date - Aug 21 , 2026 | 01:20 AM
మామి డి సీజన్ చివర్లో ధరలు రికార్డు స్థాయిలో పలికాయి.
బంగారుపాళ్యం, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): మామి డి సీజన్ చివర్లో ధరలు రికార్డు స్థాయిలో పలికాయి. మామిడి తోపులను కొని వ్యాపారం చేసే చిత్తూరుకు చెందిన సిరాజ్, ఆవులకొండకు చెందిన సాదిక్ నాణ్యమైన తోతాపురి, నీలం మామిడి కాయలను చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్‌కు తీసుకొచ్చారు. వీటికి గురువారం రాత్రి వేలం నిర్వహించగా కలకడకు చెందిన వల్లీ నీలం టన్ను రూ.1.4 లక్షలకు.. తోతాపురి రకాన్ని బెంగళూరుకు చెందిన బలరామ్ రూ.1.21 లక్షలకు దక్కించుకున్నారు.