Share News

Satellite: 20నిమిషాల్లో కక్ష్యలోకి ఎన్‌వీఎ్‌స-03 ఉపగ్రహం

ABN , Publish Date - Oct 31 , 2026 | 02:35 AM

రోదసీ ప్రయోగాల్లో మరోసారి మన శాస్త్రవేత్తలు సత్తాచాటారు. నావిగేషన్‌ సేవలను మరింత బలోపేతం చేసేందుకు శ్రీహరికోటలోని షార్‌ నుంచి ఇస్రో చేపట్టిన ప్రయోగం విజయవంతం కావడంతో షార్‌లో సంబరాలు మిన్నంటాయి.

Satellite: 20నిమిషాల్లో కక్ష్యలోకి ఎన్‌వీఎ్‌స-03 ఉపగ్రహం
నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్‌

సూళ్లూరుపేట,అక్టోబరు 30(ఆంరఽధజ్యోతి): రోదసీ ప్రయోగాల్లో మరోసారి మన శాస్త్రవేత్తలు సత్తాచాటారు. నావిగేషన్‌ సేవలను మరింత బలోపేతం చేసేందుకు శ్రీహరికోటలోని షార్‌ నుంచి ఇస్రో చేపట్టిన ప్రయోగం విజయవంతం కావడంతో షార్‌లో సంబరాలు మిన్నంటాయి.సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి శుక్రవారం రాత్రి జీఎ్‌సఎల్వీ-ఎఫ్‌ 18 రాకెట్‌ను శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రయోగించారు. ఈ రాకెట్‌ ద్వారా రెండోతరం నావిగేషన్‌ సేవలకు సంబంధించిన ఎన్‌వీఎ్‌స-03 ఉపగ్రహాన్ని జీఎ్‌సఎల్వీ-ఎఫ్‌ 18 వాహక నౌక రోదసీలోకి ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగాన్ని 18 నిమిషాల 45సెకన్లలోనే ముగించి 2,250 కిలోల బరువు గల ఎన్‌వీఎ్‌స03 శాటిలైట్‌ను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ప్రయోగానికి 24 గంటల ముందు గురువారం రాత్రి 11:51 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్‌ శుక్రవారం రాత్రి 11:51 గంటలకు సున్నకు చేరగానే షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి జీఎ్‌సఎల్వీ-ఎఫ్‌ 18 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. మూడు దశలను విజయవంతంగా పూర్తిచేసి ఉపగ్రహాన్ని కక్ష్యలోకి చేర్చింది.ప్రయోగం విజయవంతంపై ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ వి.నారాయణన్‌ మాట్లాడుతూ ఇది చరిత్రలో నిలిచిపోయే ప్రయోగమన్నారు.స్వదేశీ పరిజ్ఞానంతో సొంత నావిగేషన్‌ వ్యవస్థను రూపొందించుకోవడమే కాకుండా భారీ ప్రయోగాలు చేపట్టే స్థాయికి ఎదిగామంటే మన శాస్త్రవేత్తల సమష్టి కృషి ఫలితమేనన్నారు.షార్‌లో ప్రయోగాన్ని వీక్షించేందుకు ఆంధ్ర, తమిళనాడు ప్రాంతాల నుంచి వేలాదిమంది శుక్రవారం సాయంత్రమే షార్‌కు తరలివచ్చారు. వీరిలో ఎక్కువ మంది విద్యార్థులున్నారు. సూళ్లూరుపేట నుంచి శ్రీహరికోట వరకు వాహనాలు తెల్లవారుజామునుంచే భారులు తీరాయి. రాకెట్‌ నింగికి ఎగురుతున్న సమయంలో వారి చప్పట్లు, ఈలలు, కేకలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది.రాకెట్‌ నింగికెగిరిన తరువాత వీక్షకులు గ్యాలరీ వద్దే సంబరాలు చేసుకున్నారు.

Updated Date - Oct 31 , 2026 | 02:36 AM