మాజీ ఎంపీ నారపల్లి శివప్రసాద్ వర్ధంతి.. ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు నివాళి..
ABN , Publish Date - Sep 21 , 2026 | 09:07 AM
తెలుగుదేశం నేత, మాజీ ఎంపీ నారమల్లి శివప్రసాద్ వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. తన బాల్య మిత్రుడైన శివప్రసాద్‌ను వర్ధంతి నేపథ్యంలో ఆయనను గుర్తు చేసుకున్నారు.
అమరావతి: తెలుగుదేశం నేత, మాజీ ఎంపీ నారమల్లి శివప్రసాద్ వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. తన బాల్య మిత్రుడైన శివప్రసాద్‌ను వర్ధంతి నేపథ్యంలో ఆయనను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజాసేవ పట్ల ఆయనకు ఉన్న అంకితభావాన్ని, కళారంగంలో చేసిన కృషిని కొనియాడారు. శివప్రసాద్ జ్ఞాపకాలు తన హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.
సీఎం చంద్రబాబు ఎక్స్ పోస్టు..
‘నా బాల్య మిత్రుడు, మంత్రిగా, ఎంపీగా ప్రజలకు విశేష సేవలందించిన తెలుగుదేశం నేత, సినీ నాటక కళాకారుడు, దర్శకుడు నారమల్లి శివప్రసాద్ గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు. ప్రజాసేవ పట్ల ఆయన అంకితభావం, కళారంగంలో ఆయన చేసిన కృషి చిరస్మరణీయం. ఆయన జ్ఞాపకాలు ఎప్పటికీ నా హృదయంలో నిలిచిపోతాయి’ అంటూ ఎక్స్‌లో సీఎం చంద్రబాబు సందేశాన్ని పోస్టు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
నేడు కుప్పానికి సీఎం చంద్రబాబు.. రెండు రోజులు బిజీబిజీగా పర్యటన..