Share News

ఏపీఆర్‌ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షప్రధాన కార్యదర్శులుగా బొప్పరాజు, చేబ్రోలు

ABN , Publish Date - Sep 21 , 2026 | 06:19 AM

ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ (ఏపీఆర్‌ఎస్ఏ) రాష్ట్ర అధ్యక్షుడిగా బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆరోసారి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చేబ్రోలు కృష్ణమూర్తి మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంఘం 18వ రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశం విజయవాడలోని రెవెన్యూ భవన్‌లో ఆదివారం జరిగింది.

ఏపీఆర్‌ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షప్రధాన కార్యదర్శులుగా బొప్పరాజు, చేబ్రోలు

విజయవాడ (గాంధీనగర్‌), సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ (ఏపీఆర్‌ఎస్ఏ) రాష్ట్ర అధ్యక్షుడిగా బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆరోసారి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చేబ్రోలు కృష్ణమూర్తి మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంఘం 18వ రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశం విజయవాడలోని రెవెన్యూ భవన్‌లో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా బొప్పరాజు, చేబ్రోలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారి పీవీ కృష్ణారావు, సహాయ ఎన్నికల అధికారి ఈ.ఫణికుమార్‌ ప్రకటించారు. అసోసియేట్‌ అధ్యక్షుడిగా గొట్టాపు శ్రీరామ్మూర్తి, రాష్ట్ర కోశాధికారిగా ఆర్‌ఎస్‌ దివాకర్‌తో పాటు మరో 26 మందిని రాష్ట్ర కార్యవర్గంలో ఉపాధ్యక్షులు, ఆర్గనైజింగ్‌ సెక్రటరీలు, రాష్ట్ర కార్యదర్శులుగా ఎంపిక చేసినట్టు తెలిపారు.

ఈ సందర్భంగా సంఘ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ రెవెన్యూ శాఖ గౌరవాన్ని కాపాడేలా పనిచేస్తూ ప్రభుత్వానికి మంచిపేరు తీసుకొస్తామన్నారు. రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా, ఉద్యోగుల హక్కుల సాధనకు పోరాడతామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సెల్‌ఫోన్‌ ద్వారానే రెవెన్యూ శాఖలోని అన్ని సేవలు ప్రజలకు అందుతున్నాయన్నారు. అనంతరం బొప్పరాజు వెంకటేశ్వర్లు, చేబ్రోలు కష్ణమూర్తిని ఉద్యోగులు గజమాలతో ఘనంగా సత్కరించారు. ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర నేతలు పలిశెట్టి దామోదరరావు, టీవీ ఫణిపేర్రాజు, తిమ్మసర్తి నాగేశ్వరరావు, బి.కిశోర్‌కుమార్‌, ఆర్‌.శ్రీనివాసరావు, బత్తిన రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 21 , 2026 | 06:19 AM