Share News

Rain: జిల్లాలో భారీ వర్షం

ABN , Publish Date - Sep 21 , 2026 | 12:43 AM

అల్పపీడనం వాయుగుండంగా విస్తరించడంతో గడిచిన 24 గంటల్లో 23 మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా కుప్పంలో 112.2 మి.మీ వర్షపాతం నమోదైంది.

Rain: జిల్లాలో భారీ వర్షం
ఐరాల మండలం చెంగనపల్లెలో నేలకూలిన చెట్టు

చిత్తూరు కలెక్టరేట్‌, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): అల్పపీడనం వాయుగుండంగా విస్తరించడంతో గడిచిన 24 గంటల్లో 23 మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా కుప్పంలో 112.2 మి.మీ వర్షపాతం నమోదైంది. నిండ్ర, విజయపురం, నగరి, శ్రీరంగరాజపురం, పాలసముద్రం మినహా మిగిలిన 23 మండలాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి భారీవర్షాలు కురిశాయి. మండలాలవారీగా.. పెనుమూరులో 87.0, గుడుపల్లెలో 77.2, తవణంపల్లెలో 61.2, గంగాఽధరనెల్లూరులో 59.0, ఐరాలలో 52.2, చిత్తూరు రూరల్‌లో 32.4, చిత్తూరు అర్బన్‌లో 32.4, రొంపిచర్లలో 32.2, పూతలపట్టులో 31.2, పులిచర్లలో 25.4, శాంతిపురంలో 24.4, బంగారుపాళ్యంలో 20.4, బైరెడ్డిపల్లెలో 20.4, రామకుప్పం, పెద్దపంజాణిలలో 18.2, యాదమరిలో 17.0, గంగవరంలో 11.4, పలమనేరులో 10.0, వెదురుకుప్పంలో 9.2, వి.కోటలో 8.6, గుడిపాలలో 5.0, కార్వేటినగరంలో 1.2 మి.మీ వర్షపాతం నమోదైంది. ఐరాల మండలం చెంగనపల్లెలో శనివారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి భారీ వృక్షం రోడ్డుకు అడ్డంగా కూలింది. మూడు గంటలపాటు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.

Updated Date - Sep 21 , 2026 | 12:43 AM