Share News

శేషాచలం అడవుల్లో చెలరేగిన మంటలు..

ABN , Publish Date - Apr 26 , 2026 | 09:35 PM

తిరుపతి జిల్లా శేషాచలం అడవుల్లో మరోసారి మంటలు చెలరేగాయి. జీవకోన పైభాగంలో ప్రమాదవశాత్తూ ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.

శేషాచలం అడవుల్లో చెలరేగిన మంటలు..
Fire Breaks Out in Seshachalam

తిరుపతి: శేషాచలం అడవుల్లో మరోసారి మంటలు చెలరేగాయి. జీవకోన పైభాగంలో ప్రమాదవశాత్తూ అగ్నిప్రమాదం సంభవించింది. సుమారు 500 మీటర్ల విస్తీర్ణంలో అడవి తగలపడుతుండగా.. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. సమాచారం అందిన వెంటనే మంటలను ఆర్పివేసేందుకు జీవకోన వద్దకు తరలివెళ్లారు.


సుమారు 20 మంది సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. అయితే, అగ్నికీలలు మరింతగా చెలరేగడంతో మరో 30 మంది అదనపు సిబ్బందినీ అధికారులు తరలించారు. మొత్తం 50 మంది అటవీ శాఖ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరింతగా అడవిని దహించకుండా చర్యలు తీసుకుంటున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అటవీ శాఖ అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

వైకల్యాన్ని జయించి.. ఎవరెస్ట్‌ బేస్ క్యాంప్‌ను అధిరోహించిన తెలుగు తేజాలు..

అంతర్జాతీయ టెక్ మ్యాప్‌లో విశాఖకు చోటు

Updated Date - Apr 26 , 2026 | 09:57 PM