ప్రియుడితో కలిసి కుమారుడిపై మహిళ దాడి.. బ్లేడుతో కోసి చిత్రహింసలు..
ABN , Publish Date - Jul 17 , 2026 | 03:08 PM
వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో ఓ చిన్నారిపై కన్నతల్లే దాడి చేసిన ఘటన చిత్తూరు జిల్లా వి.కోటలో చోటుచేసుకుంది. ఏకాంతంగా గడిపేందుకు ఇబ్బందిగా ఉందని ప్రియుడు చెప్పడంతో కుమారుడిపైనే దారుణానికి ఒడిగట్టింది.
చిత్తూరు జిల్లా: వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో ఓ చిన్నారిపై కన్నతల్లే దాడి చేసిన ఘటన చిత్తూరు జిల్లా వి.కోటలో చోటుచేసుకుంది. ఏకాంతంగా గడిపేందుకు ఇబ్బందిగా ఉందని ప్రియుడు చెప్పడంతో కుమారుడిపైనే దారుణానికి ఒడిగట్టింది. వి.కోటకు చెందిన మహిళకు ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. ఇటీవల ఎర్రచేనుకు చెందిన రాజుతో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో తరచూ అతను వి.కోటకు వచ్చి సదరు మహిళను కలుస్తూ ఉండేవాడు. ఇద్దరూ ఏకాంతంగా గడిపేవారు.
ఈ క్రమంలో వారికి బాలుడు అడ్డుగా అనిపించాడు. ఇదే విషయాన్ని ప్రియుడు ఆ మహిళకు చెప్పగా.. చిన్నారిని ఇంటి నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేశారు. ఇందుకు అతడిని చిత్రహింసలకు గురి చేయడం ప్రారంభించారు. తరచూ విపరీతంగా కొడుతూ పైశాచిక ఆనందం పొందేవారు. చివరికి ఈరోజు (శుక్రవారం) ఇద్దరూ కలిసి చిన్నారిపై ఏకంగా బ్లేడ్‌తో దాడి చేశారు. ఇష్టమొచ్చినట్లు గాయపరిచారు. చివరికి బాలుడి మర్మాంగాలను కూడా బ్లేడ్‌తో కోశారు. దీంతో చిన్నారి తీవ్ర గాయాలతో అల్లాడిపోయాడు. విపరీతంగా అరుస్తూ ఏడవడం మొదలెట్టాడు.
ఇరుగుపొరుగు వారు హుటాహుటిన చిన్నారి వద్దకు వచ్చి చూడగా.. ఒంటినిండా రక్తపు గాయాలతో కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా గ్రామానికి చేరుకున్నారు. వెంటనే బాలుడిని కాపాడి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు పోలీసులు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, వివాహేతర సంబంధం మోజులో కన్న కొడుకునే అత్యంత ఘోరంగా చిత్రహింసలకు గురిచేసిన తల్లిపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లి అనే పదానికే మచ్చ తెచ్చిందని, ఆమెపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి...
గ్రేడ్-2 బీసీ హాస్టల్ వార్డెన్లకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్..
మోదీ ఆశీస్సులు, నిర్మల ఆలోచనలతో పరుగులు పెడుతోన్న ఏపీ: పయ్యావుల కేశవ్