Share News

BJP: 75 గంటల డప్పు మోత ప్రారంభం

ABN , Publish Date - Oct 11 , 2026 | 12:34 AM

ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకల సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా 75 గంటలపాటు నిర్విరామంగా డప్పు వాయిద్య కార్యక్రమం తిరుపతిలోని ఎస్వీయూనివర్శిటీ స్టేడియంలో శనివారం రాత్రి ఘనంగా ప్రారంభమైంది.

BJP: 75 గంటల  డప్పు మోత ప్రారంభం
డప్పు వాయిద్య కార్యక్రమం

తిరుపతి(నేరవిభాగం), అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకల సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా 75 గంటలపాటు నిర్విరామంగా డప్పు వాయిద్య కార్యక్రమం తిరుపతిలోని ఎస్వీయూనివర్శిటీ స్టేడియంలో శనివారం రాత్రి ఘనంగా ప్రారంభమైంది. ఇందుకుగాను అనేక ప్రాంతాల నుంచి డప్పు కళాకారులు పెద్ద సంఖ్యలో తిరుపతికి వచ్చారు.ఈ సందర్భంగా వెయ్యి డప్పులను కళాకారులకు పంపిణీ చేశారు. ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో సంస్థ జాతీయ అధ్యక్షుడు శివేశ్‌కుమార్‌ రామ్‌,రాష్ట్ర అధ్యక్షుడు పణతల సురేష్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌,పార్టీ అనుబంధ విభాగాల సమన్వయకర్త విష్ణువర్థన్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యా రు. డప్పు కళాకారులతో కలిసి డప్పు కొడుతూ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకుముందు ఎస్పీజేఎన్‌ఎం గ్రౌండ్‌ నుంచి ఎస్వీయూ స్టేడియం వరకు ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా శివే్‌షకుమార్‌ రామ్‌ మాట్లాడుతూ...దేశాభివృద్దికి, ప్రజల సంక్షేమానికి మోదీ అలుపెరగకుం డా కృషిచేస్తుంటే దేశంలో అశాంతి, అలజడులు సృష్టించేందుకు కొన్ని దుష్ట శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.దేశ ప్రజలందరూ మోదీకి అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌, ఎస్సీమోర్చా రాష్ట్రఅధ్యక్షుడు సురేష్‌ మాట్లాడుతూ.. డప్పు కళాకారులకు ప్రత్యేక గుర్తింపు, ఆర్థిక భరోసా కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు.రాజ్యసభ సభ్యుడు శేష్‌ కుమార్‌, జిల్లా బీజేపీ అధ్యక్షుడు సామంచి శ్రీనివా్‌స,నాయకులు కోలా ఆనంద్‌, భానుప్రకాష్‌ రెడ్డి, ఎస్సీ మోర్చా జిల్లా నాయకులు అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 11 , 2026 | 12:34 AM