సతీమణికి చంద్రబాబు పెళ్లిరోజు శుభాకాంక్షలు
ABN , Publish Date - Sep 11 , 2026 | 06:29 AM
‘పెళ్లి రోజు శుభాకాంక్షలు భు..’ అని తన సతీమణి భువనేశ్వరికి సీఎం చంద్రబాబు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపారు.
అమరావతి, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): ‘పెళ్లి రోజు శుభాకాంక్షలు భు..’ అని తన సతీమణి భువనేశ్వరికి సీఎం చంద్రబాబు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘అందరూ నన్ను సీఎం అనో లేక పార్టీ అధ్యక్షుడనో పిలవచ్చు. కానీ వీటన్నింటికంటే నేను ఎంతో ఇష్టపడే ‘భర్త’ హోదాను నాకు అందించినందుకు నీకు ధన్యవాదాలు’ అని తన సందేశంలో పేర్కొన్నారు. మంత్రి లోకేశ్ తన తల్లిదండ్రులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘మీరిద్దరూ కలసి ఇలాగే మరెన్నో ఏళ్లు నడవాలని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీసీ కెమెరాల నిఘాలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు
ఏపీ పర్యాటకానికి కేంద్రం సహకారం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News