Share News

సీఎంతో పవన్‌ భేటీ

ABN , Publish Date - Oct 23 , 2026 | 04:27 AM

ముఖ్యమంత్రి చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ నేతల అరాచకాలు, సుప్రీంకోర్టు తీర్పు, మున్సిపల్‌ అభ్యర్థుల తుది జాబితా తాత్కాలిక నిలుపుదల తదితర అంశాలపై చర్చించారు.

సీఎంతో పవన్‌ భేటీ

  • వైసీపీ ‘స్థానిక’ అరాచకాలు, కోర్టు వివాదాలపై చర్చ

  • సీట్ల సర్దుబాటు రాజీనామా వార్తపైనా..అరగంటపాటు ఉభయుల సమావేశం

అమరావతి, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ నేతల అరాచకాలు, సుప్రీంకోర్టు తీర్పు, మున్సిపల్‌ అభ్యర్థుల తుది జాబితా తాత్కాలిక నిలుపుదల తదితర అంశాలపై చర్చించారు. గురువారం ఉదయం ఉండవల్లిలోని సీఎం నివాసానికి వచ్చిన పవన్‌ అరగంట ఆయనతో భేటీ అయ్యారు. స్థానిక ఎన్నికల్లో కొన్ని చోట్ల కూటమి పార్టీల నడుమ సీట్ల సర్దుబాటు, సీట్ల రిజర్వేషన్లపై స్వల్ప విభేదాలు తలెత్తాయి. వాటిపై తమకు సమాచారం ఇవ్వలేదని జనసేన నేతలు సీఎం వద్దే అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలోనే సీఎం, డిప్యూటీ సీఎం సమావేశమయ్యారు. ఎన్నికల అంశాలతోపాటు డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంపైనా ఇద్దరూ చర్చించినట్లు సమాచారం. వాస్తవానికి స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పు, రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) నిర్ణయంపై కూటమి పార్టీల అగ్రనేతలు బుధవారం రాత్రే సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

ఈ వార్తలనూ చదవండి:

సమన్వయంతో పనిచేయండి

అప్పుల ఊబిలో యువత

Updated Date - Oct 23 , 2026 | 04:40 AM