Share News

యనమల రామకృష్ణుడుకి సీఎం చంద్రబాబు ఫోన్.. ఆరోగ్యంపై ఆరా..

ABN , Publish Date - Apr 11 , 2026 | 09:24 PM

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోగ్య పరిస్థితిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ చూపారు. వివరాల్లోకి వెళితే..

యనమల రామకృష్ణుడుకి సీఎం చంద్రబాబు ఫోన్.. ఆరోగ్యంపై ఆరా..
Yanamala Ramakrishnudu Health News

అమరావతి, ఏప్రిల్ 11: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోగ్య పరిస్థితిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ చూపారు. శనివారం యనమలకు ఫోన్ చేసిన ముఖ్యమంత్రి, ఆయన క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. గత కొద్దిరోజుల క్రితం యనమల రామకృష్ణుడు అనారోగ్యానికి గురికావడంతో వైద్యులు ఆయనకు గుండెకు స్టంట్ వేశారు. శస్త్రచికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు ఆయన ప్రస్తుతం తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.


ఫోన్ సంభాషణలో భాగంగా యనమల ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని, అందుతున్న చికిత్స వివరాలను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. పార్టీకి అండగా ఉండే సీనియర్ నేతగా ఆయన సేవలు ఎంతో కీలకమని పేర్కొన్న సీఎం.. యనమల రామకృష్ణుడు పూర్తి ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని, మళ్ళీ ప్రజా క్షేత్రంలో యాక్టివ్‌గా మారాలని ఆకాంక్షించారు.


ఇవి కూడా చదవండి..

నా అభ్యర్థిత్వానికి ఎసరు పెట్టాలనుకున్నారు.. బీజేపీపై మమత తీవ్రారోపణ

బెంగాల్‌లో డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే శాంతి భద్రతలు: ప్రధాని నరేంద్ర మోదీ

Updated Date - Apr 11 , 2026 | 09:24 PM