Share News

స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం.. కూటమి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపు

ABN , Publish Date - Nov 18 , 2026 | 04:26 PM

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పంచాయతీ ఎన్నికలు, రెండో దశ పట్టణ ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం నేతలు, కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు.

స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం.. కూటమి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపు
Chandrababu Naidu

అమరావతి, నవంబరు 18: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పంచాయతీ ఎన్నికలు, రెండో దశ పట్టణ ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం నేతలు, కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. 2024 ఎన్నికల్లో కూటమికి వచ్చిన ఓట్ల శాతం కంటే ఇప్పుడు గణనీయంగా ఎక్కువ ఓట్లు సాధించాలని సూచించారు. స్థానిక ఎన్నికలు కూటమి బలాన్ని నిరూపించుకోవడానికి మంచి అవకాశమని పేర్కొన్నారు.


ఐక్యతతో ముందుకు సాగాలి.. పొత్తు ధర్మం పాటించాలి

కూటమి పార్టీల మధ్య ఐక్యత శాశ్వతంగా ఉండాలని చంద్రబాబు స్పష్టం చేశారు. పొత్తు ధర్మానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని, కూటమి అభ్యర్థుల విజయానికి సమష్టిగా కృషి చేయాలని సూచించారు. ప్రతి ఎన్నికలోనూ విజయం సాధించడమే లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. ఏ ఒక్క వార్డులో ఓటమి ఎదురైనా అందుకు గల కారణాలను విశ్లేషిస్తానని తెలిపారు. గ్రామాల్లో, నియోజకవర్గాల్లో నాయకుల మధ్య ఉన్న ఐక్యతను పరిశీలించి, దానికి అనుగుణంగా తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. రాజకీయ ముసుగులో వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా వ్యవహరించే వారికి ప్రజలే తగిన సమాధానం చెప్పేలా వాస్తవాలను వివరించాలని పార్టీ శ్రేణులకు సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణ ఓటర్ల జాబితాపై ఈసీ కీలక నిర్ణయం

బాబా బర్త్‌డే స్పెషల్‌.. బెంగళూరు-ధర్మవరం మధ్య ప్రత్యేక ప్యాసింజరు రైలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 18 , 2026 | 04:28 PM