ఎల్‌నినో ప్రభావంపై సీఎం చంద్రబాబు సమీక్ష.. రైతుల రక్షణపై కీలక ఆదేశాలు
ABN , Publish Date - Sep 20 , 2026 | 05:49 PM
ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో అమరావతిలో అధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు నాయుడు కీలక సూచనలు చేశారు.
అమరావతి, సెప్టెంబర్ 20: ఏపీలో ఎల్‌నినో ప్రభావం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, యాక్షన్ ప్లాన్ అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు, అధికారులు, ఉద్యోగులు, ఆర్ఎస్కే సిబ్బందితో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం.. ఎల్‌నినో పరిస్థితులను ముందుగానే అంచనా వేసి, తగిన చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. ఎల్‌నినో ప్రభావం వల్ల రైతులు, వ్యవసాయ రంగంపై ప్రతికూల ప్రభావం పడకుండా తాత్కాలిక, మధ్యంతర ప్రణాళికలతో ముందుకు సాగాలని సూచించారు. రైతులను ఆదుకోవడంతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా చూడటమే ప్రధాన లక్ష్యంగా అధికారులు పనిచేయాలని స్పష్టం చేశారు.
ముఖ్యంగా బియ్యం, ఉల్లి, పామాయిల్, కందిపప్పు వంటి నిత్యావసర వస్తువుల ధరలను అదుపులో ఉంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. హైరిస్క్ ఆర్ఎస్కే పరిధిలోని హార్టికల్చర్ పంటలను ఆదుకునేందుకు ప్రభుత్వం అందిస్తున్న నిధులను సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకునేలా రైతులకు ముందస్తు సూచనలు, అవసరమైన సహాయం అందించడంతో పాటు డిమాండ్ ఆధారిత పంటల సాగుపై దృష్టి సారించాలని అన్నారు. పరిస్థితులకు అనుగుణంగా శాఖల మధ్య సమన్వయంతో కార్యాచరణ అమలు చేయాలని, రైతులకు నష్టం కలగకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కేసీఆర్ కుటుంబ సభ్యుల భూముల విచారణపై కట్టుబడి ఉన్నాం: మహేశ్ గౌడ్
రోడ్ల విస్తరణకు ఇరిగేషన్ అధికారులు ఎందుకు అడ్డం పడుతున్నారు: ఎంపీ రఘునందన్ రావు
హైదరాబాద్‌లో పోలీసుల భారీ ఆపరేషన్.. 425 కేజీల గంజాయి స్వాధీనం
Read Latest Telangana News And AP News