Share News

అన్ని అంశాల్లో ప్రజల భాగస్వామ్యం!

ABN , Publish Date - Sep 01 , 2026 | 05:26 AM

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం, వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభోత్సవం వంటి కార్యక్రమాలకు ప్రజల భాగస్వామ్యం పెద్దయెత్తున వచ్చిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. దీనిని ఇతర అంశాలకూ వర్తింపచేయాలని, మున్ముందు అన్ని పథకాలకు కొనసాగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

అన్ని అంశాల్లో ప్రజల భాగస్వామ్యం!

  • తద్వారా ప్రతి కార్యక్రమంలో సానుకూల ఫలితాలు

  • భోగాపురం ఎయిర్‌పోర్టు, వెలిగొండ ప్రాజెక్టుల

  • తరహాలో మున్ముందు మరింత కొనసాగాలి

  • ప్రభుత్వ కార్యక్రమాలపై విస్తృత ప్రచారం

  • ఆర్టీజీఎస్‌ సమీక్షలో సీఎం ఆదేశాలు

అమరావతి, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం, వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభోత్సవం వంటి కార్యక్రమాలకు ప్రజల భాగస్వామ్యం పెద్దయెత్తున వచ్చిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. దీనిని ఇతర అంశాలకూ వర్తింపచేయాలని, మున్ముందు అన్ని పథకాలకు కొనసాగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌పై సీఎం సమీక్ష నిర్వహించారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా కృష్ణా నది జలాలు రావటంతో ప్రజల్లో ఎంతో ఆనందం వ్యక్తమైందని, ప్రతీ కార్యక్రమం ప్రజల భాగస్వామ్యంతో నిర్వహిస్తే సానుకూల ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. డేటా అనలిటిక్స్‌తో పౌరసేవలను మరింత సమర్థవంతంగా అందించాలని ఈ సందర్భంగా అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ప్రత్యేకించి మహిళలపై నేరాలు, గంజాయి నియంత్రణ సహా వివిధ అంశాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని నిర్దేశించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ఈ విషయంలో ఎలాంటి రాజీ లేదని స్పష్టం చేశారు. సూచించారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్రలో భాగంగా పరిశుభ్రతపై ప్రజలకు మరింత లోతైన అవగాహన కల్పించాలన్నారు. సంక్షేమ హాస్టళ్లలో మెరుగ్గా శానిటేషన్‌ నిర్వహించాలని ఆదేశించారు. ప్రతినెలా మొదటి ఆదివారం నాడున విద్యార్థుల తల్లిదండ్రులను ఆహ్వానించి హాస్టళ్లలో పరిస్థితులు, ఆహారం, తాగునీరు తదితర అంశాలపై వివరించాలని ముఖ్యమంత్రి సూచించారు. అన్న క్యాంటీన్ల ద్వారా దాతలు అన్నార్తులకు సాయం అందించే అంశాన్ని కూడా గుర్తించాలని పేర్కొన్నారు. జిల్లాలు, నియోజకవర్గాల వారీగా ఎప్పటికప్పుడు సమీక్షించుకుని లోటుపాట్లను సవరించుకోవాలని నిర్దేశించారు. బాధ్యులకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో ర్యాంకులు ఇవ్వాలన్నారు.


ఆన్‌లైన్‌ సేవలు మరింత విస్తృతం

ప్రభుత్వ శాఖలన్నీ ఆన్‌లైన్‌లో సేవలు అందించాలని, సమీకృత సేవల విధానం ద్వారా తక్షణ నిర్ణయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అన్నారు. రెవెన్యూ సహా వివిధ విభాగాలు అన్ని ధ్రువపత్రాలనూ ఆన్‌లైన్‌లో జారీచేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ‘అవేర్‌’ ద్వారా రాష్ట్రంలో సాగు స్థితిపై ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి, రైతులకు సూచనలు జారీ చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రకృతి సేద్యం పెంచేందుకు పూర్తిస్థాయిలో సహకారం అందించాలని స్పష్టం చేశారు. ఉద్యాన పంటలను కాపాడుకునేందుకు ప్రస్తుతమున్న నీటి వనరులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. భూమి నిరుపయోగంగా ఉండకూడదని, 5.70 లక్షల ఎకరాల్లో ప్రతి ఎకరాను సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. పీజీఆర్‌ఎస్‌ ద్వారా వచ్చే దరఖాస్తుల పరిష్కారంపై కూడా దృష్టి పెట్టాలని నిర్దేశించారు. సమీక్షకు సీఎస్‌ సాయిప్రసాద్‌, వివిధ శాఖల అదికారులు హాజరయ్యారు.

ఈ వార్తలను కూడా చదవండి

2027 యూపీ ఎన్నికలు.. డింపుల్ యాదవ్ కేంద్రంగా అఖిలేష్ కీలక వ్యూహం..

పెట్రోల్‌లో ఇథనాల్ శాతం వెల్లడించాలని పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..

Updated Date - Sep 01 , 2026 | 05:26 AM