స్థానిక ఎన్నికల్లో బీజేపీ స్ట్రైక్ రేటు 75 శాతం: మాధవ్
ABN , Publish Date - Nov 08 , 2026 | 04:45 AM
‘స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) 75 శాతానికి పైగా స్ట్రైక్ రేటు నమోదు చేసింది. పార్టీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణకు ఇదే నిదర్శనం’ అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు.
విశాఖపట్నం, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): ‘స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) 75 శాతానికి పైగా స్ట్రైక్ రేటు నమోదు చేసింది. పార్టీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణకు ఇదే నిదర్శనం’ అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. ఆయన విశాఖలో శనివారం విలేకరులతో మాట్లాడారు. ‘పార్టీని క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేయాలనే లక్ష్యంతో రూపొందించిన వ్యూహాత్మక కార్యాచరణ సత్ఫలితాలు ఇచ్చింది.
రాష్ట్రవ్యాప్తంగా 30 జడ్పీటీసీ స్థానాల్లో బీజేపీ పోటీ చేయగా మూడు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన స్థానాల్లో అత్యధికం పార్టీ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. అదేవిధంగా 1,049 ఎంపీటీసీ స్థానాల్లో పోటీ చేయగా 53 ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన స్థానాల్లో మెజారిటీ అభ్యర్థులు విజయం సాధించారు. ఈ విజయాలు రాష్ట్రంలో బీజేపీ భవిష్యత్తు విస్తరణకు బలమైన పునాదులు వేస్తాయి. కూటమి ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న విశ్వాసానికి ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శం’ అని మాధవ్ అన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఫలించిన మంత్రి కొండపల్లి వ్యూహం.. బొత్స కూతురిపై సామాన్య మహిళ గెలుపు..