Share News

‘అనంత’లో కోళ్లకు బర్డ్‌ ఫ్లూ

ABN , Publish Date - Oct 07 , 2026 | 04:14 AM

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం సిద్దరాంపురం, వజ్రకరూర్‌ మండలం కడమలకుంటు గ్రామాల్లో కోళ్లకు బర్డ్‌ ఫ్లూ సోకినట్లు పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌ అమరేంద్రకుమార్‌ మంగళవారం ప్రకటించారు.

‘అనంత’లో కోళ్లకు బర్డ్‌ ఫ్లూ

అమరావతి, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం సిద్దరాంపురం, వజ్రకరూర్‌ మండలం కడమలకుంటు గ్రామాల్లో కోళ్లకు బర్డ్‌ ఫ్లూ సోకినట్లు పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌ అమరేంద్రకుమార్‌ మంగళవారం ప్రకటించారు. సిద్దరాంపురంలో 2,500, కడమలకుంటులో 1,400కోళ్లు ఇటీవల మృతి చెందగా, వాటి నమూనాలను భోపాల్‌ ఎన్‌ఐహెచ్‌ఎస్ఏడీ ల్యాబ్‌కు పంపారు. హెచ్‌ఎస్ఎన్‌1 బర్డ్‌ ఫ్లూ (ఏవిఎన్‌ ఇన్‌ప్లుయెంజా)గా నిర్ధారణ అయింది. ఈ కోళ్లను తెలంగాణలోని ఆదిలాబాద్‌ నుంచి తెచ్చినట్లు గుర్తించారు. ఇతర కోళ్లకు బర్డ్‌ ఫ్లూ సోకకుండా ఫారం చుట్టూ కిలోమీటరు పరిధిని ఇన్ఫెర్టెడ్‌ జోన్‌గా, 10కిలోమీటర్ల పరిధిని అలర్ట్‌ జోన్‌గా ప్రకటించారు. పౌల్ర్టీ నిర్వాహకులు, ఉత్పత్తుల వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, బాగా ఉడికించిన గుడ్లు, చికెన్‌ను తీసుకోవచ్చని సూచించారు.

ఈ వార్తలనూ చదవండి..

అమరావతి పనుల్లో వేగం పెంచాలి.. ప్రతి నెల రూ. 2వేల కోట్ల పనులు పూర్తి చేయాలి: సీఎం

స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పోటీ చేసే స్థానాలు ఖరారు..!

Updated Date - Oct 07 , 2026 | 04:14 AM