AP News: అది ఏపీ అభివృద్ధికి గేమ్ ఛేంజర్: మంత్రి జనార్ధన్
ABN , Publish Date - Jan 04 , 2026 | 04:46 PM
భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టులో తొలి విమానం ల్యాండ్ అవడం ఏపీ అభివృద్ధి ప్రయాణంలో ఒక గేమ్ ఛేంజర్ రాష్ట్ర మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి అన్నారు. ఆదివారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన..
అమరావతి, జనవరి 4: భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టులో తొలి విమానం ల్యాండ్ అవడం ఏపీ అభివృద్ధి ప్రయాణంలో ఒక గేమ్ ఛేంజర్ అని మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి అన్నారు. ఆదివారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. నేడు వ్యాలిడేషన్ ఫ్లైట్‌ను విజయవంతంగా పూర్తి చేయడం సంతోషకర పరిణామం అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ విమానయాన రంగంలో ఇది చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం ఎయిర్ పోర్టు ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతీయ కనెక్టివిటీ బలోపేతం, ప్రాంతీయ అభివృద్ధికి కారణ భూతం కానుందన్నారు మంత్రి.
జూన్ నుంచి వాణిజ్య విమాన సర్వీసులు ప్రారంభం కావడంతోపాటు ప్రజలకు అందుబాటులోకి రాబోతుండటం మంచి పరిణామం అని సంతోషం వ్యక్తం చేశారు. ఈ విమానాశ్రయంతో ఉత్తరాంధ్ర అభివృద్ధి పథంలో ముందుకెళ్తోందన్నారు. భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్‌తో భవిష్యత్తులో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారబోతున్నాయని మంత్రి చెప్పుకొచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పని చేయడం ద్వారా నిర్దిష్ట గడువులోగా ఎయిర్ పోర్టు నిర్మాణం పూర్తి చేయగలిగామన్నారు. దూర దృష్టితో నాడు భోగాపురం ఎయిర్ పోర్టుకు శ్రీకారం చుట్టినా.. నేడు సకాలంలో నిర్మాణం పూర్తి చేసినా.. ఆ ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందన్నారు మంత్రి జనార్ధన్ రెడ్డి.
Also Read:
Nicolas Maduro Capture: వెనెజువెలా అధ్యక్షుడి కొంప ముంచిన ఛాలెంజ్!
BEL Job Notifications: బీఈఎల్ జాబ్ నోటిఫికేషన్.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే..
Shashi Tharoor: బలవంతుడిదే రాజ్యం... వెనెజువెలాలో అమెరికా సైనిక చర్యపై శశిథరూర్