Share News

చంద్రబాబు జోక్యంతోనే బీసీ రిజర్వేషన్ల పెంపు సాధ్యం

ABN , Publish Date - Oct 02 , 2026 | 05:04 AM

సీఎం చంద్రబాబునాయుడు జోక్యం చేసుకుంటేనే బీసీ రిజర్వేషన్ల పెంపు సాధ్యమవుతుందని, బీసీలపై చిత్తశుద్ది ఉంటే ప్రధానితో సీఎం భేటీ కావాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ కోరారు.

చంద్రబాబు జోక్యంతోనే బీసీ రిజర్వేషన్ల పెంపు సాధ్యం

  • బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల

అమరావతి, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబునాయుడు జోక్యం చేసుకుంటేనే బీసీ రిజర్వేషన్ల పెంపు సాధ్యమవుతుందని, బీసీలపై చిత్తశుద్ది ఉంటే ప్రధానితో సీఎం భేటీ కావాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ కోరారు. బీసీ రిజర్వేషన్లు పెంచాలంటే రాజకీయ నిర్ణయంతోనే సాధ్యమని గురువారం ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. బీసీ కులగణన చేసి బిహార్‌, తెలంగాణ రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయించినా.. బీసీలకు రిజర్వేషన్ల పెంపు సాధ్యం కాలేదన్నారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌, నితీశ్‌కుమార్‌ తలచుకుంటే 24 గంటల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు సాధ్యమేనన్నారు. 34 శాతం బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని జాజుల డిమాండ్‌ చేశారు.

ఈ వార్తలనూ చదవండి:

వివేకా కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం.. వారికి నోటీసులు

ప్రభుత్వ భూములకు స్కెచ్‌

Updated Date - Oct 02 , 2026 | 05:04 AM