Share News

ఉత్తమ టీచర్లుగా 173 మంది

ABN , Publish Date - Sep 04 , 2026 | 06:55 AM

రాష్ట్రవ్యాప్తంగా 173 మందిని రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా విద్యాశాఖ గుర్తించింది. ఈ నెల 5న (శనివారం) ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వీరికి అవార్డులు ప్రదానం చేయనుంది.

ఉత్తమ టీచర్లుగా 173 మంది

  • రేపు బెజవాడలో సీఎం చేతుల మీదుగా అవార్డుల ప్రదానం

అమరావతి, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా 173 మందిని రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా విద్యాశాఖ గుర్తించింది. ఈ నెల 5న (శనివారం) ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వీరికి అవార్డులు ప్రదానం చేయనుంది. విజయవాడలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వీరికి అవార్డులు అందజేస్తారు. పాఠశాల విద్యలో 79 మంది, ఇంటర్‌ విద్యలో 24 మంది, సాంకేతిక విద్యలో 14 మంది, ఉన్నత విద్యలో 56 మందిని ఉత్తమ టీచర్లుగా ప్రభుత్వం ఎంపిక చేసింది. వీరికి ప్రశంసా పత్రం, రూ.20 వేల నగదు బహుమతి అందజేస్తారు.

ఇవి కూడా చదవండి

తిలక్‌ అదిరెన్‌!

కేరళ సీఎంతో రొనాల్డ్ సోదరి భేటీ.. వీడియో వైరల్

Updated Date - Sep 04 , 2026 | 06:55 AM