Share News

750 ఎలక్ట్రిక్‌ బస్సులు రెడీ

ABN , Publish Date - Nov 19 , 2026 | 03:26 AM

ప్రజలకు మరింత మెరుగైన ప్రయాణ సేవలు అందించేందుకు ఏపీస్ఆర్‌టీసీ ఎలక్ట్రిక్‌ బస్సుల్ని సమకూరుస్తోం ది.

750 ఎలక్ట్రిక్‌ బస్సులు రెడీ

  • డిసెంబరు లోపు 700 రాక

  • ఇప్పటికే విశాఖకు 50 బస్సులు

  • మరో 1450 బస్సులకు టెండర్‌: ఆర్టీసీ

అమరావతి, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): ప్రజలకు మరింత మెరుగైన ప్రయాణ సేవలు అందించేందుకు ఏపీస్ఆర్‌టీసీ ఎలక్ట్రిక్‌ బస్సుల్ని సమకూరుస్తోం ది. ఇప్పటికే 750 బస్సులు సిద్ధమయ్యాయని సంస్థ చీఫ్‌ పీఆర్‌వో జె.గణపతిరా వు తెలిపారు. అందులో 50 బస్సులు విశాఖపట్నం చేరుకున్నాయని, మరో 700 బస్సులు డిసెంబరులోపు వస్తాయని బుధవారం తెలిపారు.

రాష్ట్రంలో ప్రయాణికులు పెరగడం, బస్సులు తగ్గడంతో పడుతున్న ఇబ్బందులపై ‘పాత బస్సులు.. కస్సు బుస్సులు’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనంపై గణపతిరావు వివరణ ఇచ్చారు. ఆర్టీసీ 3 వేల బస్సుల్ని సమకూర్చుకునే పనిలో ఉందన్నారు. తిరుమలకు కేటాయించిన ప్రత్యేక బస్సులు 300 త్వరలో రాబోతున్నాయని వివరించారు. మరో 1450 బస్సులకు టెండర్‌ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి:

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై జగన్‌కు లోకేశ్ కౌంటర్

పంజాబ్‌లో లారీ డ్రైవర్‌కు రూ.12 కోట్ల జాక్‌పాట్

Updated Date - Nov 19 , 2026 | 03:32 AM