Share News

ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఉద్యోగులందరికీ తప్పనిసరి ఆరోగ్య పరీక్షలు

ABN , Publish Date - Apr 10 , 2026 | 09:23 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తన సిబ్బంది సంక్షేమం, భద్రతపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇకపై 'పీరియాడికల్ హెల్త్ చెక్-అప్' (పీహెచ్‌సీ) విధానాన్ని తప్పనిసరి చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే..

ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఉద్యోగులందరికీ తప్పనిసరి ఆరోగ్య పరీక్షలు
APSRTC News

అమరావతి, ఏప్రిల్ 10: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) తన సిబ్బంది సంక్షేమం, భద్రతపై ప్రత్యేక దృష్టి సారించింది. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల అకాల మరణాలను నివారించేందుకు, వారి ఆరోగ్యాన్ని కాపాడేందుకు 'పీరియాడికల్ హెల్త్ చెక్-అప్' (PHC) విధానాన్ని తప్పనిసరి చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందు కేవలం డ్రైవర్లకు మాత్రమే పరిమితమైన ఈ వైద్య పరీక్షలను, ఇకపై సంస్థలోని అన్ని కేటగిరీల ఉద్యోగులకు విస్తరింపజేస్తున్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి కార్యాలయ సిబ్బంది వరకు ప్రతి ఒక్కరికీ ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.


ఈ నిర్ణయం ప్రకారం.. 45 ఏళ్లు పైబడిన ఉద్యోగులందరికీ ప్రతి ఆరు నెలలకు ఒకసారి తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. ముఖ్యంగా గుండె, కాలేయం, కిడ్నీ సంబంధిత వ్యాధులను ముందస్తుగా గుర్తించి, తగిన చికిత్స అందించడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం. ఈ నూతన నిబంధన మే 1, 2026 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని డిపోలలో అమలులోకి రానుంది. విధి నిర్వహణలో ఒత్తిడికి గురయ్యే సిబ్బందికి ఈ నిర్ణయం ఎంతో ఊరటనిస్తుందని కార్మిక వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మే నెల నుంచి ప్రారంభం కానున్న ఈ వైద్య పరీక్షల కోసం అధికారులు ఇప్పటికే అన్ని డిపోలలో ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

భోగాపురం విమానాశ్రయం.. ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు

వైసీపీ నేతలది గుంట నక్కల రాజకీయం: కేంద్ర మంత్రి రామ్మోహన్

Updated Date - Apr 10 , 2026 | 09:23 PM