‘అసిస్టెంట్ ప్రొఫెసర్’ పరీక్షలు వాయిదా వేయండి
ABN , Publish Date - Nov 14 , 2026 | 12:54 AM
అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల పరీక్షలను వాయిదా వేయాలని ఎన్నికల విధుల్లో ఉన్న అభ్యర్థులు ఏపీపీఎస్సీని కోరుతున్నారు.
అమరావతి, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల పరీక్షలను వాయిదా వేయాలని ఎన్నికల విధుల్లో ఉన్న అభ్యర్థులు ఏపీపీఎస్సీని కోరుతున్నారు. డిసెంబరు 1 నుంచి 5 వరకు అసిస్టెంట్ ప్రొఫెసర్, ఆర్జీయూకేటీల్లోని లెక్చరర్ పోస్టులకు పరీక్షలు నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ షెడ్యూలు జారీ చేసింది. అయితే డిసెంబరు 2 వరకు పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.
ఎక్కువ శాఖల ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. కాగా, డిసెంబరు 2న పోలింగ్ ఉన్నందున ఆరోజు జరగాల్సిన అసిస్టెంట్ ప్రొఫెసర్, ఆర్జీయూకేటీ లెక్చరర్ పోస్టుల పరీక్షను 9వ తేదీకి వాయిదా వేసినట్లు ఏపీపీఎస్సీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. మిగిలిన పరీక్షల తేదీలు మార్పులేదని పేర్కొంది.
ఈ వార్తలనూ చదవండి:
జగన్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది: మంత్రి లోకేశ్