ఏకగ్రీవానికి టెండర్!
ABN , Publish Date - Nov 16 , 2026 | 01:30 AM
అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలం నక్కలపల్లి పంచాయతీ సర్పంచ్ పదవి ఏకగ్రీవానికి టెండరు విధానాన్ని అనుసరించారు.
బెళుగుప్ప, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలం నక్కలపల్లి పంచాయతీ సర్పంచ్ పదవి ఏకగ్రీవానికి టెండరు విధానాన్ని అనుసరించారు. అన్‌రిజర్వ్‌డ్ మహిళకు కేటాయించిన ఈ స్థానం కోసం పలువురు ఏకగ్రీవ ప్రయత్నాలు చేస్తుండగా..
ఆదివారం రాత్రి గ్రామస్థులు సమావేశమమై పంచాయతీ అభివృద్ధికి ఆశావహులు ఎంతమేర డబ్బు ఇవ్వగలరో చీటీలో రాసి ఇవ్వాలని కోరారు. 8 మంది తమ చీటీలను సమర్పించారు. అందులో సుదర్శన్ రెడ్డి అత్యధికంగా రూ.25.60 లక్షలకు కోట్ చేయడంతో అతడి కుటుంబికులకే సర్పంచ్ పదవి ఏకగీవం చేస్తూ నిర్ణయించారు.
ఈ వార్తలనూ చదవండి:
సొంత వైద్యం.. ప్రాణాలకే ముప్పు
ఏపీలో జోరుగా పంచాయతీ ఎన్నికల నామినేషన్లు..!