రాష్ట్రపతితో భేటీకి 10 మంది గిరిజన విద్యార్థులు
ABN , Publish Date - Sep 13 , 2026 | 04:24 AM
నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (నెస్ట్స్) ఆధ్వర్యంలో ఏపీలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో చదివే 10 మంది గిరిజన విద్యార్థులకు అరుదైన అవకాశం దక్కింది.
అమరావతి, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (నెస్ట్స్) ఆధ్వర్యంలో ఏపీలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో చదివే 10 మంది గిరిజన విద్యార్థులకు అరుదైన అవకాశం దక్కింది. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో అమృత్ ఉద్యాన్ సందర్శనకు వీరు ఎంపికయ్యారని ఏపీ గిరిజన గురుకుల సొసైటీ కార్యదర్శి ఎం.గౌతమి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపతి ముర్మును కలిసే అరుదైన అవకాశాన్ని ఈ విద్యార్థులు పొందినట్లు ఆమె తెలిపారు. ఈ విద్యార్థుల బృందం 13న విజయవాడ నుంచి న్యూఢిల్లీ బయలుదేరుతుంది. 15న రాష్ట్రపతి భవన్, అమృత్ ఉద్యాన్‌లను సందర్శించి, రాష్ట్రపతిని కలుస్తుంది. 16న న్యూఢిల్లీలోని చారిత్రక, అధ్యయన ప్రాంతాలను సందర్శిస్తుంది. 17న తిరిగి విజయవాడ చేరుకుంటుంది.
ఈ వార్తలనూ చదవండి:
ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ వైద్యం
‘స్థానిక’ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలి