ఎక్సైజ్ పాలసీ 2026-27 అమలుకు ఏపీ ప్రభుత్వం చర్యలు
ABN , Publish Date - Sep 25 , 2026 | 07:21 PM
ఏపీలో కొత్త ఎక్సైజ్ పాలసీ అమల్లోకి రానుంది. 2026-27 ఎక్సైజ్ పాలసీ అమలు కోసం ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ఈ పాలసీ ద్వారా 807 మద్యం దుకాణాల కేటాయింపునకు లాటరీ నిర్వహించనున్నారు. మొత్తం 3,736 మద్యం దుకాణాల్లో 2,929 దుకాణాల రెన్యూవల్ పూర్తయ్యాయి.
ఇంటర్‌నెట్ డెస్క్: ఏపీలో కొత్త ఎక్సైజ్ పాలసీ అమల్లోకి రానుంది. 2026-27 ఎక్సైజ్ పాలసీ అమలు కోసం ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ఈ పాలసీ ద్వారా 807 మద్యం దుకాణాల కేటాయింపునకు లాటరీ నిర్వహించనున్నారు. మొత్తం 3,736 మద్యం దుకాణాల్లో 2,929 దుకాణాల రెన్యూవల్ పూర్తయ్యాయి. 799 ఓపెన్ కేటగిరి, 8 రిజర్వ్‌డ్ కేటగిరీ దుకాణాలకు లాటరీ నిర్వహించనున్నారు. కాగా.. కొత్త మద్యం పాలసీ కోసం ఈనెల 24న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. వచ్చే నెల అక్టోబర్ 1 వరకు దరఖాస్తులకు గడువు ఇచ్చారు.
అక్టోబర్ 5న లాటరీ ద్వారా దుకాణాల కేటాయింపు జరుగుతుంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్, హైబ్రిడ్ విధానాల్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. ప్రతి దరఖాస్తుకు రూ.3 లక్షల నాన్-రిఫండబుల్ ఫీజు వసూలు చేయనున్నారు. లైసెన్స్ గడువు ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి వచ్చే సంవత్సరం సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటుంది. ఇక వైఎస్ఆర్ కడప జిల్లాలో అత్యధికంగా 60 దుకాణాలకు లాటరీ నిర్వహించనుండగా.. అనంతపురంలో 53, విశాఖలో 52, నెల్లూరులో 51 దుకాణాలకు లాటరీ నిర్వహించేందుకు నోటిఫికేషన్ ఇచ్చారు. కాగా.. 3,736 దుకాణాల్లో 3,396 షాపులను ఓపెన్ కేటగిరీకి కేటాయించగా, 340 షాపులను గీత కార్మికులకు రిజర్వ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
వైసీపీకి యనమల కృష్ణుడు రాజీనామా.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక
గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ మహా గణపయ్య
Read Latest AP News And Telugu News