Share News

అమరావతిలో పాన్‌ ఐఐటీ వరల్డ్ కౌన్సిల్‌

ABN , Publish Date - Oct 04 , 2026 | 05:11 AM

దేశవ్యాప్తంగా 23 ఐఐటీల నుంచి పట్టభద్రులైన ఐఐటియన్లతో అమరావతిలో ‘పాన్‌ ఐఐటీ వరల్డ్‌ కౌన్సిల్‌’ను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ కౌన్సిల్‌ ప్రపంచంలోనే అతిపెద్ద అకడమియన్ల నెట్‌వర్క్‌గా నిలవనుందని వ్యాఖ్యానించారు.

అమరావతిలో పాన్‌ ఐఐటీ వరల్డ్ కౌన్సిల్‌

  • ఏపీని గ్లోబల్‌ నాలెడ్జ్‌ హబ్‌గా తీర్చిదిద్దుతాం: సీఎం

అమరావతి, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా 23 ఐఐటీల నుంచి పట్టభద్రులైన ఐఐటియన్లతో అమరావతిలో ‘పాన్‌ ఐఐటీ వరల్డ్‌ కౌన్సిల్‌’ను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ కౌన్సిల్‌ ప్రపంచంలోనే అతిపెద్ద అకడమియన్ల నెట్‌వర్క్‌గా నిలవనుందని వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఐఐటీల నుంచి పట్టభద్రులైన 5లక్షల మంది తమ ఆలోచనలను పంచుకునే వేదికగా కౌన్సిల్‌ ఉండబోతోందని వెల్లడించారు. వారి ఆలోచనలను సద్వినియోగం చేసుకుంటే రాష్ట్రాభివృద్ధి వేరే స్థాయిలో ఉంటుందన్నారు. ఏపీని గ్లోబల్‌ నాలెడ్జ్‌ హబ్‌గా తీర్చిదిద్దడంలో పాన్‌ ఐఐటీ వరల్డ్‌ కౌన్సిల్‌ దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అమరావతికి పెద్ద ఎత్తున ఐఐటియన్లు రావడమే రాష్ట్రానికి ఉన్న బ్రాండ్‌కు నిదర్శనమ న్నారు. ప్రస్తుతం అతి తక్కువ ధరతో క్వాంటం కంప్యూటర్లను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని సాఽధించామని, భారత్‌, ఏపీ ఎప్పుడూ యూజర్లగా కాకుండా ప్రొడ్యూసర్లుగా ఉండాలని, దానికి అనుగుణంగా నైపుణ్యాలు పెంచుకోవాలని ఆకాంక్షించారు. వచ్చే రెండేళ్లలో కమర్షియల్‌ క్వాంటం కంప్యూటర్లను తయారు చేస్తామని ప్రకటించారు. జాతీయ స్థాయిలో కోటి మంది ఏఐ నిపుణులను తయారు చేయాలని ప్రధాని మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారని, వారిని ఏపీ నుంచే 50 లక్షల మందిని అందిస్తామని సీఎం పేర్కొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

ట్రేడింగ్‌ చీటింగ్‌

పెట్‌ స్కాన్‌కు ప్రతిపాదన

అసలుకే మోసం!

Updated Date - Oct 04 , 2026 | 06:57 AM