Share News

బియ్యం ధరల నియంత్రణకు రైస్ మిల్లర్ల కీలక నిర్ణయం.. ఆగస్టు 1 నుంచి తక్కువ ధరకే విక్రయాలు

ABN , Publish Date - Jul 30 , 2026 | 09:06 PM

ఏపీలో పెరుగుతున్న బియ్యం ధరలను నియంత్రించేందుకు ఏపీ ప్రభుత్వం, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సంయుక్తంగా కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఆగస్టు 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక అవుట్‌లెట్లలో సాధారణ మార్కెట్ ధర కంటే తక్కువ ధరకే బియ్యం విక్రయించనున్నట్లు ఏపీ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వరరావు ప్రకటించారు.

బియ్యం ధరల నియంత్రణకు రైస్ మిల్లర్ల కీలక నిర్ణయం.. ఆగస్టు 1 నుంచి తక్కువ ధరకే విక్రయాలు
Andhra Pradesh Rice News

అమరావతి, జులై 30: రాష్ట్రంలో బియ్యం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో సామాన్య ప్రజలకు ఊరటనిచ్చేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఏపీ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సంయుక్తంగా కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఆగస్టు 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక అవుట్‌లెట్ల ద్వారా నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఏపీ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వరరావు వెల్లడించారు. ఈ కార్యక్రమం ద్వారా మార్కెట్‌లో బియ్యం ధరలను నియంత్రించడంతో పాటు వినియోగదారులపై పడుతున్న అదనపు భారం తగ్గించడమే ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరల ప్రభావాన్ని తగ్గించేందుకు మిల్లర్ల సంఘం ప్రభుత్వంతో కలిసి ఈ కార్యక్రమాన్ని చేపడుతోందన్నారు.


ఈ ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 130 రైతు బజార్లలో ప్రత్యేక బియ్యం విక్రయ కౌంటర్లను ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా 500కు పైగా రైస్ మిల్లుల వద్ద కూడా ప్రజలకు నేరుగా బియ్యం విక్రయించే ఏర్పాట్లు చేస్తున్నారు. స్టీమ్ రైస్ (BPT, KNR) కిలోను రూ.52కు, రా రైస్ (BPT, KNR) కిలోను రూ.50కే అందించనున్నట్లు గుమ్మడి వెంకటేశ్వరరావు తెలిపారు. నాణ్యమైన బియ్యాన్ని అందుబాటు ధరలో ప్రజలకు అందించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని పేర్కొన్న ఆయన, రాష్ట్ర ప్రజలందరూ ఈ ప్రత్యేక సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం, రైస్ మిల్లర్ల సమన్వయంతో చేపట్టిన ఈ చర్య బియ్యం ధరల నియంత్రణలో కీలకంగా మారుతుందని భావిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

2034 వరకూ నేనే ముఖ్యమంత్రిగా ఉంటా: సీఎం రేవంత్‌రెడ్డి

భాగ్యనగరంలో భారీ వర్షాలు.. ట్రాఫిక్ పోలీసుల కీలక సూచనలు

Read Latest Telangana News And National News

Updated Date - Jul 30 , 2026 | 10:02 PM