Share News

దూరాన్ని బట్టి పరిహారం

ABN , Publish Date - Sep 14 , 2026 | 03:17 AM

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో భూసేకరణ ధరలను ఖరారు చేసే విధానంలో కీలక మార్పులు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దూరాన్ని బట్టి భూమి ధరను మల్టిఫికేషన్‌ చేసే విధానంలో మార్పులు చేసింది. ఆదివారం రెవెన్యూ శాఖ ఈ మేరకు తుది నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నెల 15 నుంచి ఈ నోటిఫికేషన్‌ అమల్లోకి వస్తుందని పేర్కొంటూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ ఉత్తర్వులు(జీఓ 584) జారీ చేశారు.

దూరాన్ని బట్టి పరిహారం

గ్రామాలు/పట్టణ ప్రాంతాల్లో

భూసేకరణ ధరల నిబంధనల్లో మార్పులు

రేపట్నుంచే తుది నోటిఫికేషన్‌ అమల్లోకి

అమరావతి, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో భూసేకరణ ధరలను ఖరారు చేసే విధానంలో కీలక మార్పులు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దూరాన్ని బట్టి భూమి ధరను మల్టిఫికేషన్‌ చేసే విధానంలో మార్పులు చేసింది. ఆదివారం రెవెన్యూ శాఖ ఈ మేరకు తుది నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నెల 15 నుంచి ఈ నోటిఫికేషన్‌ అమల్లోకి వస్తుందని పేర్కొంటూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ ఉత్తర్వులు(జీఓ 584) జారీ చేశారు. ఇంతకుముందు ప్రాథమిక నోటిఫికేషన్‌ను జూలై 29న విడుదల చేయగా, ఇప్పుడు తుది నోటిఫికేషన్‌ ఇచ్చారు. భూసేకరణ పరిహారం ఖరారు విధానాల్లో లోపాలున్నాయని, వాటిని సవరించాలని కోరుతూ రైతులు కసిరాజు సీతారామయ్య, మరికొందరు హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. దాన్ని విచారించిన హైకోర్టు పరిహారాన్ని ఖరారు చేయడంలో ఉన్న లోపాలను సరిద్దాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.


ఈ నేపథ్యంలో భూసేకరణ చట్టం-2013 అమలు రూల్స్‌లోని 28(1)లో రెవెన్యూ శాఖ సవర ణలు చేసింది. రైతుల భూమిని ప్రభుత్వం సేకరించినప్పుడు పరిహారం ఖరారు చేయడంలో మల్టిఫికేషన్‌ విధానం అవలంభిస్తుంది. ఎకరాకు 10 లక్షలు ఉన్నప్పుడు రైతులు రెండింతల పరిహారం అంటే.. 15 నుంచి 20 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తుంటారు. దీన్నే మల్టిఫికేషన్‌ ఫ్యాక్టర్‌ అంటారు. ఇలాంటి సందర్భాల్లో గ్రామంలో ఉన్న భూములకు, గ్రామానికి దూరంలో ఉన్న భూములకు, ఇంకా పట్టణాలకు సమీపంలో ఉన్న భూములకు దూరాన్ని బట్టి మల్టిఫికేషన్‌ ఖరారు చేసేలా నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చారు. దీని ప్రకారం గ్రామానికి 2 కి.మీ. దూరం వరకు భూమిని సేకరించినప్పుడు మల్టిఫికేషన్‌ 1.05, గ్రామానికి 2 నుంచి 5 కి.మీ. దూరం వరకు సేకరించినప్పుడు 1.10, గ్రామానికి లేదా పట్టణాలకు 5 కి.మీ. దూరం తర్వాత ఉన్న భూములకు 1.50 మల్టిఫికేషన్‌తో పరిహారం ధరలు ఖరారు చేయాలని రూల్స్‌లో పొందుపరిచారు. షెడ్యూల్డ్‌ ఏరియాల్లో 1.50 చొప్పున పరిహారం ఖరారు చేయాలని రూల్స్‌లో చేర్చారు.

ఈ వార్తలనూ చదవండి..

ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు: కలిశెట్టి

‘డీఎస్సీపై చర్చకు జగన్‌ సిద్ధమా?’

Updated Date - Sep 14 , 2026 | 03:17 AM