Share News

ముగిసిన ఈఎన్‌టీ వైద్యుల సదస్సు

ABN , Publish Date - Sep 13 , 2026 | 11:33 PM

నగరంలోని నంద్యాల రోడ్డు కే. ఫార్చున్‌ హోటల్‌లో జరిగిన రాష్ట్రస్థాయి ఈఎన్‌టీ వైద్యులు సదస్సు ఆదివారం ముగిసింది.

ముగిసిన ఈఎన్‌టీ వైద్యుల సదస్సు
రాష్ట్ర స్థాయి సదస్సులో పాల్గొన్న ఈఎన్‌టీ వైద్యులు

కర్నూలు హస్పిటల్‌, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): నగరంలోని నంద్యాల రోడ్డు కే. ఫార్చున్‌ హోటల్‌లో జరిగిన రాష్ట్రస్థాయి ఈఎన్‌టీ వైద్యులు సదస్సు ఆదివారం ముగిసింది. సదస్సు అర్గనైజింగ్‌ చైర్మన్‌ డా హరికృష్ణ, కార్యదర్శి డా. జయప్రకా్‌షరెడ్డి, కోశాధికారి డా. మహేంద్రకుమార్‌ మాట్లాడుతూ మూడు రోజులుగ జరిగిన రాష్ట్ర సదస్సులో ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక నుంచి 540 మంది వైద్యులు హాజరైనట్లు తెలిపారు. 3వ రోజు ఈఎ్‌సఎఫ్‌ రైనోరియా సమగ్ర నిర్వహణ, మధ్యచెవిలో ఏర్పడే చర్మపు పెరు గుదలపై శస్త్ర చికిత్స, ట్రాన్స్‌ నాసల్‌ ఈ ఫోఫేగోస్కోపి, పుర్రె ముక్కుకూత ఎముక శస్త్ర చికిత్సపై వైద్యులకు శిక్షణ ఇచ్చారు. జిల్లా ఈఎన్‌టీ వైద్యుల సంఘం అధ్యక్షుడు డా ఎం. మహేంద్ర కుమార్‌, వందన సమర్పణ చేస్తు సదస్సు విజయవంతంగ నిర్వహించిన రాష్ట్ర అధ్యక్షుడు, ఆర్గనైజింగ్‌ కార్యదర్శి డా. జయప్రకా్‌షరెడ్డి, ఆర్గనైజింగ్‌ చైర్మన్‌ డా. హరికృష్ణను అభినందించారు. సదస్సుకు సహకరించిన కేఎంసీ ప్రిన్సిపాల్‌, కర్నూలు జీజీ హెచ్‌ సూప రింటెండెంట్‌, మెడికల్‌ కౌన్సిల్‌ చైర్మన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కాకినాడకు చెందిన డీ జీఎన్‌ఎ్‌స మూర్తి రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నుకోగా ఇతర కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎనుకున్నారు.

Updated Date - Sep 13 , 2026 | 11:33 PM