17, 18న రెవెన్యూ వర్క్‌షాప్
ABN , Publish Date - Sep 14 , 2026 | 03:40 AM
రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ శాఖ చేపడుతున్న కార్యక్రమాల ఫలితాలను విశ్లేషించేందుకు, భవిష్యత్ టాస్క్‌లు చేపట్టేందుకు వర్క్‌షాప్ నిర్వహించనున్నారు. అమరావతిలో ఈ నెల 17, 18 తేదీల్లో సీసీఎల్‌ఏ కార్యాలయంలో వర్క్‌షాప్ నిర్వహించాలని రెవెన్యూ శాఖ నిర్ణయించింది.
17, 18న రెవెన్యూ వర్క్‌షాప్
అమరావతిలో జోన్ల వారీగా నిర్వహణ
అమరావతి, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ శాఖ చేపడుతున్న కార్యక్రమాల ఫలితాలను విశ్లేషించేందుకు, భవిష్యత్ టాస్క్‌లు చేపట్టేందుకు వర్క్‌షాప్ నిర్వహించనున్నారు. అమరావతిలో ఈ నెల 17, 18 తేదీల్లో సీసీఎల్‌ఏ కార్యాలయంలో వర్క్‌షాప్ నిర్వహించాలని రెవెన్యూ శాఖ నిర్ణయించింది. జిల్లాల జాయింట్ కలెక్టర్లు, ఆర్డీఓలు, జిల్లా సర్వే, సెటిల్ అధికారులు ఈ వర్క్‌షాప్‌నకు హాజరు కావాలని భూ పరిపాలనా ప్రధాన కమిషనర్(సీసీఎల్‌ఏ) జి.జయలక్ష్మి ఆదేశాలు జారీ చేశారు. రెండు రోజుల పాటు జరిగే వర్క్‌షా్‌పలో జోన్‌ల వారీగా అధికారులు పాల్గొనాలని ఆదేశించారు. 17వ తేదీన జోన్-1లోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలు, జోన్-2లోని అల్లూరి జిల్లా, పోలవరం, తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలు, జోన్-3లోని పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల జేసీలు, ఆర్డీఓలు, సర్వే అధికారులు పాల్గొనాలని సీసీఎల్‌ఏ ఆదేశించారు. 18వ తేదీన జరిగే వర్క్‌షాప్‌లో జోన్-4లోని గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, జోన్-5లోని తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, జోన్-6లోని నంద్యాల, అనంతపురం, కర్నూలు, సత్యసాయి జిల్లాల అధికారులు పాల్గొనాలని షెడ్యూల్ ఇచ్చారు.
ఇదీ అజెండా
వచ్చే మార్చి నాటికి భూ వివాదాలు లేని రాష్ట్రంగా మారుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు పలు వేదికల్లో ప్రకటించారు. తాజాగా కలెక్టర్ల సదస్సులోనూ రెవెన్యూ శాఖకు ఇదే ప్రధాన టార్గెట్ అని చెప్పారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ల సమావేశంలో సీఎం ఇచ్చిన ఆదేశాల అమలుతో పాటు 17 అంశాలపై రెవెన్యూ వర్క్‌షా్‌పలో చర్చిస్తామని సీసీఎల్‌ఏ తెలిపారు. భూహక్కు పత్రాల పునరుద్ధరణ, రీసర్వే పురోగతి, మార్చి నాటికి భూ వివాదాలు లేని రాష్ట్రంగా మార్చడానికి కార్యాచరణ, పాస్‌పుస్తకాల పంపిణీ, జీఓ 306, 444, 445ల అమలు, ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులు, 22(ఏ) దరఖాస్తుల పరిష్కారం, పీజీఆర్‌ఎస్ అమలు, భూసేకరణ ప్రతిపాదనలపై జేసీలతో చర్చించనున్నారు.
ఈ వార్తలనూ చదవండి..
ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు: కలిశెట్టి
‘డీఎస్సీపై చర్చకు జగన్ సిద్ధమా?’