మంత్రాలయానికి పోటెత్తిన భక్తులు
ABN , Publish Date - Sep 13 , 2026 | 11:32 PM
ప్రముఖ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వచ్చిన లక్షలాది మంది భక్తులతో మార్మోగింది.
మంత్రాలయం, సెప్టెంబరు 13 (ఆంధ్ర జ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వచ్చిన లక్షలాది మంది భక్తులతో మార్మోగింది. రెండో శనివారం, ఆది, సోమవారాలు సెలవుదినాలు కావడంతో దక్షణాది రాష్ర్టాలైన ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుతో పాటు దేశ నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. మఠం ప్రాం గణం భక్తులతో కిక్కిరిసింది. భక్తులు తుంగభద్ర నదిలో పుణ్యస్నానాలు ఆచరించి గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకొని రాఘవేంద్రస్వామి మూల బృందావనానికి పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ప్రసాదాల కొరత రాకుండా మఠం అధికారులు ప్రత్యేకకౌంటర్లు ఏర్పాటు చేశారు. దర్శనానికి ఐదు గంటల సమయం పట్టింది.