Share News

ఇండీ కూటమి నేతల నిర్బంధం

ABN , Publish Date - Oct 11 , 2026 | 03:34 AM

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ ఇండియా కూటమి పక్షాలు చేపట్టిన చలో లోక్‌భవన్‌ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది.

ఇండీ కూటమి నేతల నిర్బంధం

  • చలో లోక్‌భవన్‌ను అడ్డుకున్న పోలీసులు

  • గన్నవరంలో పీసీసీ చీఫ్‌ షర్మిల హౌస్‌ అరెస్టు

  • లెనిన్‌ సెంటర్‌లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వీఎస్‌ అరెస్టు

విజయవాడ, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ ఇండియా కూటమి పక్షాలు చేపట్టిన చలో లోక్‌భవన్‌ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ఈ కార్యక్రమానికి పోలీసులు అనుమతిని నిరాకరించారు. అయినా లోక్‌భవన్‌కు చేరుకోవడానికి కాంగ్రెస్‌, సీపీఎం, సీపీఐ పక్షాల నేతలు సిద్ధమయ్యారు. వారితో వైసీపీ నేతలు జత కట్టారు. చలో లోక్‌భవన్‌ నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గన్నవరం మండలం కేసరపల్లిలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలను గృహ నిర్బంధం చేశారు.

ఆమెకు పోలీసులు నోటీసు ఇచ్చినా తీసుకోవడానికి నిరాకరించారు. తానే స్వయంగా కారు నడుపుకుంటూ ఇంటి నుంచి లోక్‌భవన్‌కు బయలుదేరారు. ప్రధాన ద్వారం వద్ద పోలీసులు ఆమె వాహనాన్ని అడ్డుకున్నారు. లెనిన్‌ సెంటర్‌లో కార్యకర్తలతో నిరసన తెలుపుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వీ శ్రీనివాసరావుతోపాటు మరికొంతమందిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్‌ బాబూరావు, దోనేపూడి కాశీనాథ్‌, మాజీ ఫ్లోర్‌ లీడర్‌ బోయ సత్యబాబు, వైసీపీ నేత, సెంట్రల్‌ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణును గృహ నిర్బంధం చేశారు. కాంగ్రెస్‌ నేత సుంకర పద్మశ్రీని గన్నవరంలో అడ్డుకున్నారు. ఇళ్ల నుంచి నేతలను కదలనివ్వకుండా నిర్బంధించారు. రాజ్యాంగం నిరసన తెలిపే హక్కును ఇచ్చినప్పటికీ దాన్ని కేంద్రం కాలరాస్తోందని షర్మిల విమర్శించారు. సీఈసీ రాజీనామా చేసే వరకు ఉద్యమం ఆగదని హెచ్చరించారు.

ఈ వార్తలనూ చదవండి:

ఎవరు అడ్డొచ్చినా నెట్టుకుంటూ పోతాం

జయహో బీసీ

దసరాలోపు 2వ విడత తల్లికి వందనం..!

Updated Date - Oct 11 , 2026 | 03:34 AM