Share News

పరిషత్‌ ఎన్నికల్లో 70.72 శాతం పోలింగ్‌

ABN , Publish Date - Nov 07 , 2026 | 05:34 AM

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం గణనీయంగా పెరిగింది. గత ఎన్నికల్లో 60.91 శాతం పోలింగ్‌ నమోదు కాగా... గురువారం నిర్వహించిన ఎన్నికల్లో 70.72 శాతం (+9.81శాతం) నమోదైంది.

పరిషత్‌ ఎన్నికల్లో 70.72 శాతం పోలింగ్‌

  • గత ఎన్నికలతో పోలిస్తే 9.81శాతం పెరుగుదల

  • 82.51శాతం పోలింగ్‌తో అగ్రస్థానంలో విశాఖ జిల్లా

  • అల్లూరి జిల్లాలో అత్యల్పంగా 62.01శాతం నమోదు

అమరావతి, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం గణనీయంగా పెరిగింది. గత ఎన్నికల్లో 60.91 శాతం పోలింగ్‌ నమోదు కాగా... గురువారం నిర్వహించిన ఎన్నికల్లో 70.72 శాతం (+9.81శాతం) నమోదైంది. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్‌ శాతం పెరిగింది. ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటింగ్‌ 62.16 శాతంగా నమోదైంది. విశాఖపట్నం జిల్లా అత్యధికంగా 82.51 శాతం పోలింగ్‌తో అగ్రస్థానంలో నిలిచింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యల్పంగా 62.01 శాతం నమోదైంది.

ఈ వార్తలనూ చదవండి:

కౌంటింగ్‌కు వేళాయె...

సీఎం విజయ్‌కు ఫోన్ చేసి అదే చెప్పా: సీఎం చంద్రబాబు

Updated Date - Nov 07 , 2026 | 05:35 AM