Share News

గంధపు నూనె లీకేజీ బాధ్యులపై విచారణకు ఆదేశం

ABN , Publish Date - Sep 18 , 2026 | 05:14 AM

అటవీశాఖలో అవకతవకలకు పాల్పడినట్లు అభియోగాలు నమోదైన ఉద్యోగులపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. చిత్తూరులో గంధపు చెక్కల సెంట్రల్‌ డిపోలోని సింగిల్‌ లాక్‌ గోడౌన్‌లో ...

గంధపు నూనె లీకేజీ బాధ్యులపై విచారణకు ఆదేశం

అమరావతి, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): అటవీశాఖలో అవకతవకలకు పాల్పడినట్లు అభియోగాలు నమోదైన ఉద్యోగులపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. చిత్తూరులో గంధపు చెక్కల సెంట్రల్‌ డిపోలోని సింగిల్‌ లాక్‌ గోడౌన్‌లో నిల్వ ఉంచిన పెద్ద డబ్బా నుంచి 12.53 కిలోల గంధపు నూనె లీకేజీ ఘటనలో ఆరుగురు అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే నిమిత్తం విచారణ జరుపుతోంది. అలాగే కర్నూలు రేంజ్‌లో 2022-23లో ఎర్రచందనం సంరక్షణ పథకం కింద పనుల పర్యవేక్షణలో నిర్లక్ష్యం, రూ.6.77లక్షల అదనపు వ్యయానికి కారణమైన రిటైర్డ్‌ ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ నరసయ్యపైనా ప్రభుత్వం శాఖాపరమైన చర్యలు చేపడుతోంది. ఈ మేరకు గురువారం వేర్వేరుగా ఉత్తర్వులు జారీచేసింది.

ఈ వార్తలనూ చదవండి:

భలే మంచి బేరం !

బీజేపీది ద్వంద్వ వైఖరి: బొత్స

Updated Date - Sep 18 , 2026 | 05:14 AM