రాప్తాడు బాలిక ఆరోగ్యం బాగుంది: మంత్రి లోకేశ్
ABN , Publish Date - Nov 08 , 2026 | 01:49 AM
రాప్తాడు ఘటనలో బాధిత బాలిక ఆరోగ్యం బాగుందని, స్పృహలోకి వచ్చిందని రాష్ట్ర మంత్రి లోకేశ్ తెలిపారు. ఇబ్బంది లేకుండా కుర్చీలో కూర్చోగలుగుతోందని శనివారం ‘ఎక్స్’లో వెల్లడించారు.
అమరావతి, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): రాప్తాడు ఘటనలో బాధిత బాలిక ఆరోగ్యం బాగుందని, స్పృహలోకి వచ్చిందని రాష్ట్ర మంత్రి లోకేశ్ తెలిపారు. ఇబ్బంది లేకుండా కుర్చీలో కూర్చోగలుగుతోందని శనివారం ‘ఎక్స్’లో వెల్లడించారు. డాక్టర్లు ఆమెకు సాధారణ ఆహారం ఇవ్వడం ప్రారంభించారని, కొన్ని అడుగులు నడిపించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
ఫలించిన మంత్రి కొండపల్లి వ్యూహం.. బొత్స కూతురిపై సామాన్య మహిళ గెలుపు..