విభేదాలున్నా... విలువలు కోల్పోకూడదు
ABN , Publish Date - Nov 18 , 2026 | 01:07 AM
పిల్లల పెళ్లికి పెద్దలను ఆహ్వానించడం మన సంస్కృతిలో భాగం. అదే విధంగా వైఎస్ షర్మిల కూడా తమ కుమార్తె వివాహానికి...
జగన్ మీడియా బాధ్యతారహిత కథనాన్ని ఖండిస్తున్నా: లోకేశ్
అమరావతి, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): ‘పిల్లల పెళ్లికి పెద్దలను ఆహ్వానించడం మన సంస్కృతిలో భాగం. అదే విధంగా వైఎస్ షర్మిల కూడా తమ కుమార్తె వివాహానికి సీఎం చంద్రబాబును ఆహ్వానించారు. దీనిపై షర్మిలను అవమానించేలా జగన్ మీడియా కథనాన్ని ప్రచురించడం ఎంత వరకు సమంజసం?’ అని మంత్రి లోకేశ్ ప్రశ్నించారు.
ఈమేరకు ఎక్స్‌లో ఆయన పోస్టు చేశారు. ‘ప్రజాజీవితంలో తీవ్రమైన రాజకీయ విభేదాలు ఉండొచ్చు. కానీ కనీస విలువలను ఎన్నటికీ కోల్పోకూడదు. ఏపీలో ఒక మహిళపై వ్యక్తిగత దాడులకు తావులేదు. బాధ్యతారహితమైన కథనాన్ని ప్రచురించిన జగన్ మీడియా తీరును తీవ్రంగా ఖండిస్తున్నా’ అని అన్నారు. షర్మిల కుమార్తె వివాహం సందర్భంగా షర్మిలకి, ఆమె కుటుంబ సభ్యులకు లోకేశ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
అక్వాన్ తుపానుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు