ముగిసిన మిథున్ రెడ్డి ఈడీ విచారణ..
ABN , Publish Date - Jan 23 , 2026 | 06:09 PM
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నిర్వహించిన విచారణ ముగిసింది. దాదాపు ఏడు గంటల పాటు ఈడీ అధికారులు ఆయనను ప్రశ్నించారు.
హైదరాబాద్: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నిర్వహించిన విచారణ ముగిసింది. దాదాపు ఏడు గంటల పాటు ఈడీ అధికారులు ఆయనను ప్రశ్నించారు. ఈ విచారణ సందర్భంగా పలు అంశాలపై విచారించిన అధికారులు.. కీలక వివరాలు సేకరించినట్లు సమాచారం. అయితే.. ఏపీ లిక్కర్స్ స్కామ్‌కు సంబంధించిన అంశాలపై కోర్టు ఉత్తర్వులు ఉన్నందున తానేమీ మాట్లాడలేనని మిథున్ రెడ్డి స్పష్టం చేశారు.
కాగా.. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో జరిగిన మద్యం అమ్మకాల్లో అవకతవకలు జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు కీలక నేతలను విచారించారు. ఈ కుంభకోణంలో ఎవరెవరి హస్తం ఉంది? నిధుల మళ్లింపు ఎలా జరిగింది? అనే కోణంలో ఆధారాలు సేకరిస్తున్నారు. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని గురువారం ఈడీ సుదీర్ఘంగా విచారణ జరిపింది. ఈ విచారణలో ఆయన చెప్పిన అంశాలను ఆధారంగా చేసుకుని ఈడీ అధికారులు దర్యాప్తును మరింత వేగవంతం చేస్తున్నారు.
ALso Read:
సీఎం అధ్యక్షతన ఎస్‌ఎల్‌బీసీ సమావేశం.. కీలక అంశాలపై చర్చ
నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు చంద్రబాబు, లోకేశ్ నివాళులు
Read Latest AP News And Telugu News