ఏపీ లిక్కర్ కేసు: రాజ్ కెసిరెడ్డి, వాసుదేవ రెడ్డిలకు బెయిల్!
ABN , Publish Date - Sep 24 , 2026 | 04:53 PM
ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితులుగా ఉన్న రాజ్ కెసిరెడ్డి, వాసుదేవ రెడ్డిలకు ఈడీ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
విజయవాడ/హైదరాబాద్, సెప్టెంబర్ 24: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం (AP Liquor Scam) కేసులో కీలక నిందితులుగా ఉన్న రాజ్ కెసిరెడ్డి, వాసుదేవ రెడ్డిలకు ఈడీ (ED) ప్రత్యేక కోర్టు ఉపశమనం కలిగించింది. షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.
నిందితులు ఇద్దరూ లక్ష రూపాయలు చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ముందస్తు అనుమతి లేకుండా దేశం విడిచి ఎక్కడికీ వెళ్లకూడదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ కేసులో ఉన్న సాక్షులను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభావితం చేయడానికి లేదా ఆధారాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించవద్దని హెచ్చరించింది. ఈడీ అధికారులు పిలిచినప్పుడల్లా విచారణకు హాజరై, దర్యాప్తునకు పూర్తిస్థాయిలో సహకరించాలని కోర్టు ఆదేశించింది.
ఈ వార్తలు కూడా చదవండి
బిహార్‌లో దారుణం.. మరో బాలికపై లైంగిక వేధింపులు..
ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య కేసు.. వెలుగులోకి సీసీటీవీ దృశ్యాలు.