తప్పుడు అఫిడవిట్ వేస్తారా?
ABN , Publish Date - Sep 12 , 2026 | 04:29 AM
సమాచార హక్కు (ఆర్‌టీఐ) కమిషన్‌లో అప్పీళ్లపై విచారణ సందర్భంగా అప్పీల్‌దారుల తరఫు న్యాయవాదులను అనుమతించడం లేదంటూ సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ ప్రాపర్టీ అండ్ ఎన్విరాన్‌మెంటర్ రైట్స్ సంస్థ సంయుక్త కార్యదర్శి దాడిశెట్టి వీరబాబు దాఖలు చేసిన పిల్‌పై శుక్రవారం హైకోర్టు విచారణ జరిపింది.
వ్యక్తిగత ప్రయోజనం లేదని అందులో ఎలా చెబుతారు?
పిటిషనర్‌పై హైకోర్టు ఆగ్రహం.. క్షమాపణ కోరిన న్యాయవాది జడ శ్రవణ్‌కుమార్
అమరావతి, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): సమాచార హక్కు (ఆర్‌టీఐ) కమిషన్‌లో అప్పీళ్లపై విచారణ సందర్భంగా అప్పీల్‌దారుల తరఫు న్యాయవాదులను అనుమతించడం లేదంటూ సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ ప్రాపర్టీ అండ్ ఎన్విరాన్‌మెంటర్ రైట్స్ సంస్థ సంయుక్త కార్యదర్శి దాడిశెట్టి వీరబాబు దాఖలు చేసిన పిల్‌పై శుక్రవారం హైకోర్టు విచారణ జరిపింది. రికార్డులను పరిశీలించిన ధర్మాసనం.. తప్పుడు అఫిడవిట్ సమర్పించారని పిటిషనర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన ఆర్‌టీఐ కమిషన్‌లో అప్పీల్ దాఖలు చేశారని గుర్తుచేసింది. అది పెండింగ్‌లో ఉండగానే హైకోర్టులో పిల్ వేసి.. అఫిడవిట్‌లో వ్యక్తిగత ప్రయోజనం లేదని పేర్కొనడాన్ని తప్పుపట్టింది. ఇలాంటి చర్యలను అనుమతించబోమని హెచ్చరించింది. తప్పుడు అఫిడవిట్ సమర్పించిన వీరబాబుపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని స్పష్టంచేసింది. వీరబాబు తరఫు న్యాయవాది జడ శ్రవణ్‌కుమార్ స్పందిస్తూ.. కోర్టుకు క్షమాపణ చెబుతున్నానని, పిల్‌ను ఉపసంహరించుకుని వ్యాజ్యం దాఖలు చేసుకునేందుకు అనుమతించాలని కోరారు. అందుకు ధర్మాసనం అంగీకరించింది. మీలాంటి న్యాయవాది ఈ విధంగా పిల్ వేస్తారని భావించలేదని వ్యాఖ్యానించింది. భవిష్యత్‌లో జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది.
ఈ వార్తలనూ చదవండి...
స్థానిక నాయకత్వం ఆమోదంతోనే చిన్న శ్రీనును పార్టీలోకి తీసుకున్నాం:
ఏపీ 2026-27 ఎక్సైజ్ పాలసీని ప్రకటించిన ఏపీ సర్కార్..