Share News

స్థానిక ఎన్నికలు వాయిదా వేయం!

ABN , Publish Date - Oct 31 , 2026 | 01:30 AM

ఆర్నబ్‌ తుఫాను నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని(ఎస్ఈసీ) ఆదేశించాలని కోరుతూ బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామ చంద్ర యాదవ్‌ వేసిన పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు విచారణ జరిపింది. ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది ఎన్‌. అశ్వనీ కుమార్‌ వాదనలు వినిపిస్తూ..

స్థానిక ఎన్నికలు వాయిదా వేయం!

  • హైకోర్టుకు నివేదించిన ఎస్‌ఈసీ

అమరావతి, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): ఆర్నబ్‌ తుఫాను నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని(ఎస్ఈసీ) ఆదేశించాలని కోరుతూ బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామ చంద్ర యాదవ్‌ వేసిన పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు విచారణ జరిపింది. ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది ఎన్‌. అశ్వనీ కుమార్‌ వాదనలు వినిపించారు. ‘‘తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయి. మొత్తం ఎన్నికలను వాయిదా వేయాల్సిన అవసరం లేదు.’’ అని వివరించారు. ఈ వివరాలను నమోదు చేసిన న్యాయమూర్తి జస్టిస్‌ మండవ కిరణ్మయి ప్రస్తుత పిటిషన్‌లో తాము ఆదేశాలు జారీ చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. వ్యాజ్యాన్ని డిస్పోజ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. అంతకుముందు పిటిషనర్‌ తరఫున న్యాయవాది చాపర్ల సీతారాం వాదనలు వినిపించారు.

అవినాశ్‌ వినతిపై నిర్ణయం తీసుకోండి

పులివెందుల మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా తగిన ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ వైసీపీ ఎంపీ అవినాశ్‌ రెడ్డి ఈ నెల 26న ఇచ్చిన వినతిపై తగిన నిర్ణయం తీసుకోవాలని ఎస్‌ఈసీని హైకోర్టు ఆదేశించింది. పిటిషన్‌పై తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మండవ కిరణ్మయి శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపించారు. నవంబరు 1న జరిగే ఎన్నికలకు తగిన భద్రత చర్యలు తీసుకొనేలా ఎస్‌ఈసీ, పోలీసులను ఆదేశించాలని కోరారు.


ఒకరి ఓటు మరొకరు వేయకుండా చూడండి!

డోన్‌ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఒకరి ఓటును మరొకరు వేయకుండా తగిన చర్యలు తీసుకోవాలన్న పిటిషనర్‌ వినతిపై తగిన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. పిటిషన్‌పై విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ మండవ కిరణ్మయి శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు. డోన్‌ మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా అదనపు పోలీసు బలగాలను మోహరించేలా ఎస్‌ఈసీని ఆదేశించాలని కోరుతూ వైసీపీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్ధి చైతన్య హైకోర్టును ఆశ్రయించారు. అలాగే, ఓటర్లు మృతి చెందడం, వలస వెళ్లడం సహా ఇతర కారణాలతో ప్రత్యేక సమగ్ర సవరణ ద్వారా తొలగించిన ఓటర్ల పేరుతో వేరే వ్యక్తులు ఓటు వేయకుండా చూడాలని కోరారు. పిటిషనర్‌ తరఫున న్యాయవాది సుమన్‌ వాదనలు వినిపించారు.

ఈ వార్తలనూ చదవండి:

శబరిమలై రైళ్లు ఫుల్‌

ఎల్ నినో వెళ్లిపోయాక.. వర్షాలే వర్షాలు?

Updated Date - Oct 31 , 2026 | 01:30 AM