Share News

సిరి సహస్ర కుల వివాదంపై జోక్యం చేసుకోలేం

ABN , Publish Date - Nov 21 , 2026 | 01:34 AM

విజయనగరం జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మజ్జి సిరి సహస్ర కుల ధ్రువీకరణ పత్రం వివాదంపై జిల్లా కలెక్టర్‌, డిస్ట్రిక్ట్‌ లెవల్‌ స్క్రూటినీ కమిటీ వద్ద విచారణ జరుగుతున్న నేపథ్యంలో...

సిరి సహస్ర కుల వివాదంపై జోక్యం చేసుకోలేం

ప్రస్తుతం జిల్లా స్థాయి స్క్రూటినీ కమిటీ వద్ద విచారణ జరుగుతోంది: హైకోర్టు

అమరావతి, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): విజయనగరం జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మజ్జి సిరి సహస్ర కుల ధ్రువీకరణ పత్రం వివాదంపై జిల్లా కలెక్టర్‌, డిస్ట్రిక్ట్‌ లెవల్‌ స్క్రూటినీ కమిటీ వద్ద విచారణ జరుగుతున్న నేపథ్యంలో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. ఈ దశలో జోక్యం చేసుకొనేందుకు తగిన కారణాలు కనిపించడం లేదని శుక్రవారం పేర్కొంది. బీసీ-డీ కుల ధ్రువీకరణ పత్రంతో సిరి సహస్ర పొందే ఏ ప్రయోజనమైనా కలెక్టర్‌ ఇచ్చే తుది ఉత్తర్వులకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది. బీసీ-డీ సామాజిక హోదాను కోరకుండా, తహసీల్దార్‌ జారీ చేసిన బీసీ-డీ కుల ధ్రువీకరణ పత్రం, స్థానికత, పుట్టిన తేదీ పత్రాలను వినియోగించకుండా అడ్డుకునేలా అధికారులను ఆదేశించాలన్న పిటిషనర్‌ అభ్యర్థనను తోసిపుచ్చింది. అనుబంధ పిటిషన్‌ను మూసివేసింది.

ప్రధాన వ్యాజ్యంపై తదుపరి విచారణను డిసెంబరు 3కి వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.హరినాథ్‌ ఉత్తర్వులు ఇచ్చారు. పిటిషనర్‌ తరఫున న్యాయవాది వాసిరెడ్డి ప్రభునాథ్‌, సిరి సహస్ర తరఫున సీనియర్‌ న్యాయవాది విద్యాసాగర్‌ వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించారు.

ఈ వార్తలనూ చదవండి:

పంట నష్టంపై సాయం అందించండి.. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్‌కు చంద్రబాబు వినతి

తాడిపత్రిలో హైటెన్షన్.. టీడీపీ శ్రేణులపై రాళ్ల దాడి

Updated Date - Nov 21 , 2026 | 01:38 AM